GossipsLatest News

పెళ్లి ఫొటోస్ షేర్ చెయ్యనంటున్న తాప్సి పన్ను


మార్చ్ 23 న తాప్సి పన్ను వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ కోటలో చాలా సింపుల్ గా జరిగిపోయినట్లుగా తాప్సి పెళ్లి వీడియో ఒకటి రీసెంట్ గా లీకై సోషల్ మీడియాలో సన్సేషన్ క్రియేట్ చేసింది. తాప్సి డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను తో సీక్రెట్ గా డేటింగ్ చెయ్యడమే కాదు, సీక్రెట్ గా వివాహం చేసుకుంది. తమ పెళ్లి విషయాన్ని తాప్సి ఇంతవరకు చెప్పలేదు. 

మథియాస్ బోను తో డేటింగ్, ప్రేమ, పెళ్లి అన్ని తాప్సి చాలా సీక్రెట్ గానే చేసింది. పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చెయ్యని తాప్సి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి తమ వ్యక్తిగత వ్యవహారమని, పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ చెప్పుకుంటూ, అందరిలో పెళ్లిపై ఆసక్తిని పెంచాలని తాము అనుకోలేదని, తన పెళ్లి గురించి అందరూ చర్చించుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది.

అందుకే పెళ్ళికి సంబందించిన ఏ విషయాన్ని తాను బయటపెట్టలేదని, పెళ్లి చేసుకున్న విషయాన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం కూడా తమకు లేదని, తల్లిదండ్రుల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని, జీవింతంలో ఒక్కసారే చేసుకునే పెళ్లిని ఆనందంగా చేసుకోవాలని అనుకున్నాను, అందుకే ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావు లేకుండా, కొద్దిమంది సమక్షంలోనే తాము ఒక్కటయ్యామని చెప్పింది. 

అంతేకాదు తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బయట పెట్టదలుచుకోలేదు, అందరితో పంచుకోవడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేసింది. భవిష్యత్తులో షేర్ చేయాలనుకుంటే చేస్తానని చెప్పుకొచ్చింది. 





Source link

Related posts

చిరంజీవికి లెటర్… ప్రూఫ్స్ తో మంచు విష్ణుని కలిసిన నటి హేమ!

Oknews

కాంగ్రెస్‌లోనే చనిపోతా.. కేకేపై కేసీఆర్ ఫైర్!

Oknews

మగవారికి హెచ్చరిక జారీ చేస్తున్న జెనీలియా భర్త 

Oknews

Leave a Comment