Andhra Pradesh

పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు-ఇలా రిజిస్టర్ చేసుకోండి!-amaravati news in telugu rte admission 2024 25 student registration starts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రిజిస్ట్రేషన్ ప్రారంభం

విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. cse.ap.gov.in వెబ్ సైట్ లో విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు దరఖాస్తు సమయంలో తల్లిదండ్రుల గుర్తింపు కార్డు(ఆధార్‌, ఓటర్‌, రేషన్‌, భూహక్కు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, పాస్‌పోర్ట్‌ , డ్రైవింగ్‌ లైసెన్స్‌, కరెంట్ బిల్లు, రెంటల్‌ అగ్రిమెంట్‌ కాపీ) ఒక దానిని యాడ్ చేయాలి. ప్రైవేట్ పాఠశాల్లో ప్రవేశాలకు రిజస్టర్ చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులను మార్చి 20 నుంచి 22 వరకు అధికారులు పరిశీలిస్తారు. ఏప్రిల్‌ 1న లాటరీ విధానంలో అర్హులైన విద్యార్థుల తొలి లిస్ట్ విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 2 నుంచి 10 వరకు విద్యార్థుల అడ్మిషన్లు ఫైనల్ చేసి ఏప్రిల్‌ 15న లాటరీ ద్వారా రెండో లిస్ట్ ప్రకటిస్తారు. ఏప్రిల్‌ 16 నుంచి 23 వరకు వివిధ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లు ఖరారు చేస్తారు అధికారులు. ఈ అవకాశాన్ని అర్హులైన పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.



Source link

Related posts

Arunachalam: హిందూపురం నుంచి అరుణాచ‌లం గిరి ప్రద‌క్ష‌ణ‌కు APSRTC సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్‌

Oknews

Visakha Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్- వాల్తేరు డివిజన్ లో 6 రైళ్లు ర‌ద్దు, 4 రైళ్లు రీషెడ్యూల్‌

Oknews

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, డీఎస్సీ నోటిఫికేషన్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్-amaravati news in telugu ap cabinet approved to give dsc notification with 6100 posts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment