దిశ, ఫీచర్స్ : జంక్ ఫుడ్స్ తీసుకోవడం వలన ఫైల్స్ సమస్య వస్తుంది. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, కొంతమంది మలబద్ధకం కారణంగా కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే, అటువంటి సమస్యలతో బాధపడుతున్న ఎవరైనా నివారణ చర్యలు తీసుకోవాలి. అలాగే ఆయుర్వేద నిపుణులు సూచించిన హోం రెమెడీస్ కూడా పాటించడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే పైల్స్ సమస్యలతో బాధపడేవారు ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.
ధూమపానం మానుకోండి
పైల్స్ సమస్యలతో బాధపడేవారు ధూమపానానికి దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రోజువారీ ధూమపానం జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, ఫైల్స్ తో బాధపడే వారు ఖచ్చితంగా అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
ప్రోటీన్ ఆహారాలు తినవద్దు
పైల్స్ ఉన్నవారు ప్రొటీన్ ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు జీర్ణక్రియ కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. హేమోరాయిడ్స్ ఉన్న కొంతమందికి పురీషనాళంలో మంటలు కూడా ఉండవచ్చు.
కాఫీ, టీలకు దూరంగా ఉండండి
పైల్స్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవడం చాలా మంచిది. అదనంగా, నిపుణులు కాఫీ మరియు టీలకు దూరంగా ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. మీరు కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.దీని వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది.