EntertainmentLatest News

‘పోచర్‌’పౖౖె మహేష్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. అభినందిస్తున్న నెటిజన్లు!


ప్రస్తుతం ఓటీటీ ఎంత పవర్‌ఫుల్‌గా మారిందో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి దృష్టీ ఓటీటీపైనే ఉంది. థియేటర్స్‌లో సినిమాలు రిలీజ్‌ అవుతున్నప్పటికీ ఓటీటీల ప్రాధాన్యం మరింత పెరిగిపోతోంది. ఇప్పుడు స్టార్స్‌ కూడా ఓటీటీలను ఫాలో అవుతున్నారు. అందులో రిలీజ్‌ అవుతున్న సినిమాలను, వెబ్‌ సిరీస్‌లను నిశితంగా పరిశీలిస్తున్నారు. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో ‘పోచర్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట రాకెట్‌ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ‘దిల్లీ క్రైమ్‌’ ఫేమ్‌ డైరెక్టర్‌ రిచీ మెహతా ఈ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా ఉంది. ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. మలయాళంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. 

ఈ క్రమంలోనే సూపర్‌స్టార్‌ మహేష్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను వీక్షించి దానిపై సోషల్‌ మీడియాలో స్పందించారు. అతను పెట్టిన ఒక ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ ఏమిటంటే.. ‘ఎవరైనా దీన్ని ఎలా చేయగలరు? వారి చేతులు వణకలేదా? పోచర్‌ అనే క్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఏనుగులను రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది’ అంటూ స్పందించారు. 

ఈ వెబ్‌ సిరీస్‌లో నిమిషా సజయన్‌, రోషన్‌ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య, కని కృతి, అంకిత్‌ మాధవ్‌, రంజిత మీనన్‌, మాలా పార్వతి కీలక పాత్రలు పోషించారు. ఇది తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఈ వెబ్‌సిరీస్‌కి వ్యూస్‌ లభించాయి. ఈ వెబ్‌ సిరీస్‌పై మహేష్‌ స్పందించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అడవుల్ని, అడవి జంతువుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మహేష్‌ చెప్పడం అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఈ కామెంట్‌ చేసిన మహేష్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. 



Source link

Related posts

Is Trisha in trouble because of Ajith movie? అజిత్ వల్ల త్రిషకి ఇబ్బందా?

Oknews

Asaduddin Owaisi: హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ ను సందర్శించిన అసదుద్దీన్ ఒవైసీ

Oknews

Films as propaganda in AP elections ఏపీ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా సినిమాలు..

Oknews

Leave a Comment