EntertainmentLatest News

ప్రభాస్ కల్కి కి నా ప్రభావం ఖచ్చితంగా  ఉంటుంది..మలయాళ నటి అన్నా బెన్  వ్యాఖ్యలు 


ఇంకెన్ని రోజులు ఐదు రోజులు. కేవలం ఐదు రోజులు.కాదండోయ్ నాలుగు రోజులే.  ఎందుకంటే మిడ్ నైట్ నుంచే షోస్ పడతాయి కదా. అంతే కదండీ ప్రభాస్(prabhas)కల్కి (kalki) కి  మిడ్ నైట్ నుంచే షోస్ పడతాయి కదా. దీంతో కల్కి లో దాగి ఉన్న నటుల జాబితాని  మేకర్స్ ఒక్కొక్కటిగా  తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా  ది లక్కీ రెబల్  అంటూ  కైరా క్యారక్టర్ ని పరిచయం చేసారు.  ఆమె గెటప్ చూస్తే  చాలా కీలకమైన క్యారక్టర్ అనే విషయం అర్ధం అవుతుంది. దీంతో ఆమె ఎవరని 

 మూవీ లవర్స్  సోషల్ మీడియాని ఆశ్రయించడం మొదలు పెట్టారు.

అన్నాబెన్(anna ben)మలయాళ సినీ రంగంలో మంచి పేరున్న నటి.  కుంబలి నైట్స్ ఆమె మొదటి సినిమా.2019 లో వచ్చిన ఆ మూవీ  కమర్షియల్ గా మంచి విజయం సాధించటంతో పాటు పలు అవార్డులని కూడా అందుకుంది. ఇక అన్నా అయితే  ఉత్తమ పరిచయ నటిగా సైమా,కేరళ ఫిలిం అవార్డులని అందిపుచ్చుకుంది. ఆ తర్వాత హెలెన్ ,కప్పాల, నారదన్, నైట్ డ్రైవ్,కాపా వంటి హిట్ చిత్రాల్లో చేసి క్రేజీ నటిగా మారింది. తమిళంలో  చేసిన కొట్టుక్కాలి  అయితే  74 బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమయ్యింది. దాంతో దక్షిణ భారతీయ సినీ పరిశ్రమ పెద్దల దృష్టి ఆమె పై పడింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక కల్కి లో ఆఫర్ ని చేజిక్కించుకుంది. 

ఇక తాజాగా  ఒక ఇంటర్వ్యూ లో అన్నా మాట్లాడుతు నాగ్ అశ్విన్ (naga ashwin)ఈ కథ గురించి చెప్పగానే ఎంతో  సంతోషించాను. పైగా  సైన్స్ ఫిక్షన్ కథల్లో నటించాలనేది నా డ్రీం. ఆ  కోరిక కల్కి తో నెరవేరుతుంది. నేను పోషించిన క్యారక్టర్ చిన్నదే కావచ్చు. కానీ ఖచ్చితంగా ప్రభావం చూపుతాను. అదే విధంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్, దీపికా పదుకునే వంటి మేటి నటులతో నటించడం చాలా గౌరవంగా ఉందని కూడా చెప్పుకొచ్చింది.  జూన్ 27 న కల్కి లాండింగ్.ఓవర్ సీస్ లాండింగ్ ఒకరోజు ముందే.

 



Source link

Related posts

Prabhas Fix with Lokesh Kanagaraj? లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ ఫిక్సా?

Oknews

Anasuya in a beautiful saree అందమైన చీరకట్టులో అనసూయ

Oknews

భయపడేందుకు సిద్ధంగా ఉండండి.. మార్చి 1న ‘ఇంటి నెం.13’ వచ్చేస్తోంది!

Oknews

Leave a Comment