EntertainmentLatest News

ప్రభాస్ ‘కల్కి’ కి లక్ష ఇస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ.. రెడ్ బుక్ తప్పదా


ఇప్పుడు తెలుగునాట ఏ ఇద్దరు కలిసినా ఒకటే మాట మాట్లాడుకుంటున్నారు. ఏంటి రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)పాజిటివ్ గా మాట్లాడాడా అని. పైగా  ఇది కల కాదు కదా అని  కూడా అనుకుంటున్నారు. వర్మ అంతలా ప్రతి ఒక్కరిని  విమర్శించి   అపఖ్యాహతిని మూటగొట్టుకున్నాడు. మరి  పాజిటివ్ గా ఎవరి గురించి  మాట్లాడాడో చూద్దాం.

రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas)కల్కి (kalki 2898 ad)రిలీజ్ ట్రైలర్‌ మొన్న విడుదల అయ్యింది. చూసిన ప్రతి ఒక్కరు తమ కళ్ళు ఎంత భాగ్యానికి నోచుకున్నాయి అంటు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో ఫుల్ మూవీని చూస్తామా అనే  అతృతతో  ఉన్నారు. ఇక వర్మ కి కూడా కల్కి  చూడాలనే కుతూహలం పెరిగిందనుకుంటా పాజిటివ్ గా స్పందిస్తున్నాడు. తన ట్విట్టర్లో ట్రైలర్‌ను షేర్ చేసి ఒక వండర్ అని పొగిడాడు. అంతటితో ఆగకుండా  పజిల్‌గా కొన్ని పదాలను పెట్టాడు. అందులో కొన్ని లెటర్లను మిస్ చేశాడు. అది ముందుగా ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్లకి లక్ష రూపాయిలు  ఇస్తానని  చెప్తున్నాడు. మొత్తానికి వర్మ తన వంతుగా కల్కి ని  ప్రమోట్ చేస్తున్నాడని అనుకోవచ్చు.

అన్నట్టు వర్మ మొన్న జరిగిన ఏపి ఎలక్షన్స్ కి ముందు వైసీపీ పార్టీ అధినేత జగన్ కి  అనుకూలంగా  వ్యూహం అనే  మూవీని తెరకెక్కించాడు. అందులో చంద్రబాబునాయుడు(chandrababu naidu)పవన్(pawan kalyan)లోకేష్ (lokesh)లని  చాలా దారుణంగా విమర్శించాడు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన అధికారంలో ఉన్నాయి. మరి రెడ్ బుక్ లో వర్మ ఉన్నాడో లేదో చూడాలి.  రెడ్ బుక్ నుంచి తప్పించుకోవడానికే  పాజిటివ్ దృక్పధంగా మాట్లాడుతున్నాడని అనే వాళ్ళు కూడా లేక పోలేదు.  ఇకపై పొలిటికల్ సినిమాలు తెరకెక్కించానని ఈ మధ్య స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం కొన్ని సినిమాలకి దర్సకత్వం వహిస్తున్నాడు గాని  బి గ్రేడ్  డైరెక్టర్ గా ప్రేక్షకుల దృష్టిలో చాలా బలమైన ముద్ర వేసుకున్నాడు. ఆ ఇమేజ్ ని చాలా కష్టపడి సంపాదించుకున్నాడు.



Source link

Related posts

Ayyanna Patrudu as a Assembly Speaker of AP RRRకు చెక్.. అయ్యన్న నోటికి తాళం!

Oknews

Merry Christmas OTT Release Date And Platform అప్పుడే ఓటీటీలోకి మెర్రీ క్రిస్మస్

Oknews

Anushka Shetty to marry Indian cricketer

Oknews

Leave a Comment