EntertainmentLatest News

ప్రభాస్ కల్కి ప్రొడ్యూసర్ కి వచ్చిన లాభం ఎంతో తెలుసా!. బ్లాక్ బస్టర్ అంటే అర్ధం ఇదేనా 


ఎంత సేపు ప్రభాస్(prabhas)కల్కి(kalki 2898 ad)కి ఇప్పటి వరకు వచ్చిన  కలెక్షన్స్ ఎంత! ఎన్ని రికార్డులు సాధించింది! అని  వెతకడమేనా! అసలు విషయం ఎందుకు వెతకడం లేదు. ఇప్పుడు ఈ మాటలన్నీ స్వయంగా  ప్రభాస్ ఫ్యాన్స్  నోటి నుంచే వస్తున్నాయి దాంతో  సోషల్ మీడియాలో తమకి కావలసిన న్యూస్ వెతికి ఇది కదా కిక్కు అని అనుకుంటున్నారు. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జట్ తో కల్కి తెరకెక్కింది. అదే విధంగా భారీ బిజినెస్ ని కూడా  జరుపుకొని వరల్డ్ వైడ్ గా ల్యాండ్  అయ్యింది. సినీ బిజినెస్ లో రకరకాల డీల్స్ ఉంటాయి కాబట్టి వాటి లోతుపాతుల  జోలికి వెళ్లకుండా  ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కి ఎంత లాభం వచ్చింటుందనే డౌట్ డార్లింగ్ ఫ్యాన్స్ లో తలెత్తింది. దీంతో  సోషల్ మీడియాలో అశ్వనీ దత్(Aswani Dutt)కి 160 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టిందనే న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ వార్తే ప్రభాస్ ఫాన్స్ లో జోష్ ని తెస్తుంది. మా ప్రభాస్ నిర్మాతల పాలిట బంగారు నిధి అంటు కూడా  కామెంట్స్ చేస్తున్నారు.


ప్రస్తుత సినీ ఎట్మాస్ఫైయర్ ని చూస్తుంటే ఆగష్టు 15 దాకా థియేటర్స్ దగ్గర  కల్కి హంగామా  కొనసాగే విధంగానే   ఉంది. సినిమాకి పెద్దగా కలిసి రాని రోజులైన సోమ, మంగళ వారాల్లో కూడా బుక్ మై షో లాంటి యాప్స్ లో పంతొమ్మిది వేల వరకు టికెట్స్ అమ్ముడయ్యాయి. దీంతో   1000 కోట్ల క్లబ్ లో నుంచి 1150 క్లబ్ లో కూడా చేరిన కల్కి లాస్ట్ ఫిగర్ మీద అందరిలో ఆసక్తి ఉంది. ఇక నేపాల్ లో బాహుబలి రికార్డు ని కూడా కల్కి క్రాస్ చేసింది. అదే విధంగా నేపాల్ లో  అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఫస్ట్  ఇండియన్ మూవీగా కూడా నిలిచింది. 

 



Source link

Related posts

Again Movie in Nani and Srikanth Odela Combo నాని-శ్రీకాంత్: దసరా కి సీక్వెల్ కాదా?

Oknews

ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎవరితో పడుకోవాలో ఆయనే డిసైడ్ చేస్తాడు: కంగన సొదరి

Oknews

నేను చేసిన సినిమా నాకే నచ్చలేదు.. సందీప్‌ కిషన్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Oknews

Leave a Comment