GossipsLatest News

ప్రభాస్ కోసమా? అమితాబ్ కోసమా?


నార్త్ ఆడియన్స్ కి కల్కి 2898 AD ఎందుకంతగా నచ్చేసింది.. ప్రభాస్ అంటే ఉన్న క్రేజా? లేదంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఉన్నారనా? సౌత్ ఆడియన్స్ కూడా ఒక మార్జిన్ వేసుకుని మార్కులు వేసిన కల్కి కి నార్త్ క్రిటిక్స్ అలాగే ఆడియన్స్ కల్కి 2898 AD అందలమెక్కించారు. అది ప్రభాస్ ని చూసా, లేదంటే అమితాబ్ ని చూసా అనేది చాలామందికి అర్ధం కావడం లేదు.

నాగ్ అశ్విన్ కల్కి లోకి అమితాబ్ ని తీసుకున్నప్పుడే నార్త్ లో కల్కి పై క్రేజ్ వచ్చింది. అయితే సినిమా విడుదలకు ముందు నార్త్ లో కల్కి పై ఎలాంటి బజ్ లేదు. కల్కి ప్రెస్ మీట్ ని కూడా నాగ్ అశ్విన్ ఒక్క ముంబై లో తప్ప మరెక్కడా నిర్వహించలేదు. మరి ప్రభాస్ అంటే ఇష్టమా లేదంటే అమితాబంటే క్రేజా.. దీపికా ఉందని హైప్ వచ్చిందా, లేదంటే కల్కి లో కృష్ణుడుని చూసి అక్కడి ప్రేక్షకులు, సినీ విమర్శకులు ఆదరిస్తున్నారా, ఏది ఏమైనా నార్త్ ఆడియన్స్ కల్కి ని తెగ ఆదరించేస్తున్నారు. క్రిటిక్స్ కల్కికి 4 రేటింగ్స్ ఇచ్చేసారు.

అక్కడ కల్కి కలెక్షన్స్ రోజు రోజుకి కొత్త నెంబర్లు నమోదు చేస్తున్నాయి. సౌత్ కలెక్షన్స్ కన్నా ఎక్కువగా నార్త్ లో కల్కికి కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. మరి అమితాబచ్చన్ అశ్వద్ధామ కేరెక్టర్ కి లార్డ్ కృష్ణ కేరెక్టర్ కి అక్కడి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వబట్టే నార్త్ లో కల్కి కి ఈ జోరు అనేవారు లేకపోలేదు. 



Source link

Related posts

నేను బ్రతికి ఉన్నంత వరకు అది జరగదు.. శ్రీదేవి బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన బోనీ కపూర్‌!

Oknews

hyderabad police siezed 9 crore rupees worth drugs | Hyderabad News: హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

Oknews

మాజీ ముఖ్యమంత్రి మనవడి డేటింగ్ లో ప్రముఖ హీరోయిన్!

Oknews

Leave a Comment