EntertainmentLatest News

ప్రభాస్‌ చెంప ఛెళ్ళుమనిపించిన అమ్మాయి.. ఎందుకో తెలుసా?


పాన్‌ వరల్డ్‌ స్టార్‌ ప్రభాస్‌ అంటే ఇష్టపడని వారెవరు? తను చేసే సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభాస్‌ అంటే ముఖ్యంగా అమ్మాయిలకు విపరీతమైన క్రేజ్‌. అలాంటి హీరో కళ్ళముందు కనిపిస్తే.. ఇక వారి ఆనందానికి హద్దేముంటుంది. అయితే ఓ అమ్మాయి ఒక అడుగు ముందుకు వేసి తన అభిమాన హీరోతో ఫోటో దిగడంతోపాటు అతని చెంపమీద ఒక్కటిచ్చి పరుగు తీసింది. ఈ సంఘటన ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది.

ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటికి వస్తున్న ప్రభాస్‌తో ఫోటో దిగాలని ఒక అమ్మాయి ముచ్చటపడిరది. దానికి ఓకే చెప్పిన ప్రభాస్‌ ఆమెను పట్టుకొని ఫోటో దిగాడు. ఆ అమ్మాయి ఫోటోతో సరిపెట్టుకోకుండా వెళుతూ వెళుతూ అతడి బుగ్గపై చిలిపిగా ఒక్కటి ఇచ్చి పరుగు పరుగున వెళ్ళిపోయింది. ఎంతో ఎక్సైట్‌ అయిపోయిన ఆ అమ్మాయి అల్లరిని చూసి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అయితే దీన్ని అందరూ సరదాగానే తీసుకుని నవ్వుకున్నారు. ప్రభాస్‌ కూడా ఈ విషయాన్ని లైట్‌ తీసుకున్నాడు. అయితే ఇది లేటెస్ట్‌ వీడియో కాదు. గతంలో జరిగిన సంఘటన ఇది. అయితే ఈ వీడియో ఇప్పుడు మళ్ళీ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. తన ఫేవరెట్‌ హీరోని కలుసుకున్న ఆనందంలో ఫోటో దిగడమే కాకుండా, అతన్ని ప్రేమగా చెంపమీద కొట్టి అతనిపై తనకున్న ప్రేమని తెలియజేసింది. ప్రభాస్‌ అభిమానులు కూడా దీన్ని ఎంతో పాజిటివ్‌గా తీసుకొని ఈ వీడియోను మరోసారి షేర్‌ చేస్తున్నారు.



Source link

Related posts

Pawan Kalyan To Enter New House కొత్తింట్లోకి పవన్ కళ్యాణ్

Oknews

Salaar Ready to OTT Streaming ఈ రోజు రాత్రికే ఓటీటీలో సలార్

Oknews

ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

Leave a Comment