Entertainment

ప్రభాస్‌ బర్త్‌ డే స్పెషల్‌ అదేనట.. ఇక ఫ్యాన్స్‌కి పండగే!


‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత ప్రభాస్‌ చేస్తున్న మరో సిరీస్‌ ‘సలార్‌’. బాహుబలి రెండు భాగాలుగా రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో ‘సలార్‌’ కూడా రెండు భాగాలుగా రిలీజ్‌ కానుంది. మొదటి భాగాన్ని డిసెంబర్‌ 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచి ఈ సినిమాకి హైప్‌ మరింత పెరిగింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్‌కి రెండు నెలలకు పైగా సమయం ఉంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసే అవకాశం ఉందట.

అక్టోబర్‌ 23 ప్రభాస్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘సలార్‌’ ట్రైలర్‌ను రిలీజ్‌ చెయ్యాలని అనుకుంటున్నారు మేకర్స్‌.  కెజిఎఫ్‌ సిరీస్‌ తరహాలోనే ఫుల్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రశాంత్‌ నీల్‌ ఈసినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్‌ చేయని ఒక టిపికల్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ ఓ కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తాడని అభిమానులు ఎంతో కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు. ప్రభాస్‌ బర్త్‌డేకి ‘సలార్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ అవుతుందని తెలియడంతో అక్టోబర్‌ 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. 

 



Source link

Related posts

మాట నిలబెట్టుకున్న SKN.. డిప్యూటీ సీఎం గారి తాలూకానా మజాకా!

Oknews

నిన్న హైదరాబాద్  థియేటర్ లో రచ్చ రచ్చ చేసిన బొమ్మరిల్లు సిద్దార్ధ్ 

Oknews

ఫ్రీగా చూడండి.. నచ్చుతుంది 

Oknews

Leave a Comment