EntertainmentLatest News

ప్రభాస్ బుజ్జి కారులో బన్నీ వైఫ్!


‘కల్కి 2898 AD’ లో ప్రభాస్ ఉపయోగించిన వెహికిల్ బుజ్జికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలిసిందే. ప్రమోషన్స్ లో బుజ్జి హైలైట్ గా నిలిచింది. బుజ్జిని పరిచయం చేయడం స్పెషల్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు. బుజ్జిని చూడటానికి, ఫొటోలు దిగడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో ఆసక్తి చూపించారు. ఇక తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహ సైతం బుజ్జితో దిగిన ఫొటో పంచుకుంది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అల్లు స్నేహా రెడ్డి పెట్టిన స్టోరీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బుజ్జి కారులో నిల్చొని దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. ఆ ఫొటోలో ‘కల్కి’ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా ‘కల్కి’ చిత్రాన్ని విడుదలైన రోజే పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వీక్షించాడు. ఇప్పుడేమో బన్నీ వైఫ్ స్నేహా ‘బుజ్జి’ ఫొటోని షేర్ చేశారు. దీంతో సినీ సెలబ్రిటీ కుటుంబాలు ఎలాంటి ఇగోలు, కోపాలకు పోకుండా.. ఇతర హీరోల సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తుంటారని మరోసారి స్పష్టమైంది. ఈ విషయాన్ని ఇతర హీరోలపై ద్వేషాన్ని చూపించే అభిమానులు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.



Source link

Related posts

Heavy rains hit normal life in Delhi అంతా అతి వృష్టే

Oknews

ఫ్యామిలీ స్టార్ హీరోయిన్ మృణాల్ కీలక వ్యాఖ్యలు.. సినిమా పరాజయంతో నాకు సంబంధం లేదు 

Oknews

కొరియన్ స్టార్ మా డాంగ్ సియోక్ తో ప్రభాస్ గొడవ!  ఇటలీలో ఎంజాయ్ 

Oknews

Leave a Comment