EntertainmentLatest News

ప్రముఖ నటి, దర్శకురాలు ఆకస్మిక మరణం


 

 

ఆమె ఆషామాషి వక్తి కాదు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగిలిన సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ ని సినీ రంగానికి పరిచయం చేసింది ఆమెనే.ఒక డాన్సర్ గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత నటిగా పలు చిత్రాల్లో నటించారు. అక్కడితో ఆగకుండా చాలా సినిమాలకి  రచనా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాత గా కూడాను సినిమాలు నిర్మించి ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పించింది.ఇంకా చెప్పుకోవాలంటే సుమారు 44 సినిమాలకి దర్శకత్వం వహించి  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పొందిన కీర్తిశేషులు విజయనిర్మల గారి తర్వాత నటిగా, రైటర్ గా, డైరెక్టర్ గా పేరు పొందింది  ఆవిడే కావచ్చు. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పి.జయదేవి గుండెపోటుతో మరణించడం అందరి గుండెల్ని కలిచివేస్తుంది. 

తమిళ సినీ రంగంలో పి.జయదేవి అంటే తెలియని వారు లేరు.ఎందుకంటే 1970 వ సంవత్సరం లో సినీ రంగ ప్రవేశం చేసిన జయదేవి సినిమా రంగంలో చాల కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి తమిళ సినీ రంగంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎంతో మందిని తన సినిమాల ద్వారా పరిచయం చేసి వాళ్ళు సినిమా రంగంలో స్థిరపడేలా చేసింది.అలాంటి వాళ్లలో ఒకరు ప్రముఖ ఫోటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్.ఇంకా ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే ఇదయ మలార్ ,సాయంతమ్మడమ్మ సాయంతడు ,సరైన జోడి లాంటి చిత్రాల్లో నటించింది ,అలాగే రైటర్ గా దర్శకురాలిగా  మాత్రవై నేరిల్ ,నలం నలమారియా అవళ్,విలంగుమీన్,పవర్ అఫ్ ఉమెన్,సరైన జోడి లాంటి పలు చిత్రాల్లో నటించింది.2005  లో వచ్చిన పవర్ అఫ్ ఉమెన్ ఆమె నుంచి వచ్చిన ఆఖరి చిత్రం. కొన్ని రోజుల క్రితం గుండె కి సంబంధించిన సమస్యలతో చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ లో  జాయిన్ అయిన ఆవిడ పరిస్థితి విషమించడం తో చనిపోయారు.జయదేవి భర్త పేరు  వేలు ప్రభాకరన్ ఈయన కూడా ప్రముఖ తమిళ సినీ దర్శకుడు.



Source link

Related posts

MLA Mallareddy on Congress : సీఎం రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు | ABP Desam

Oknews

ఓటీటీలోకి 'భగవంత్ కేసరి'.. ఎప్పుడు? ఎక్కడ?

Oknews

Telangana Government thinking to reduce ts tet 2024 application fees check details here

Oknews

Leave a Comment