Health Care

ప్రెగ్నెన్నీలో ఉండకూడని 10 డేంజర్ లక్షణాలు


 దిశ, ఫీచర్స్ : ప్రెగ్నెన్సీ టైమ్‌లో అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ మార్పుల మధ్య ఒత్తిడి, కోపం, వంటి లక్షణాలు స్త్రీలో తరచుగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు తక్కువగా ఉంటే పర్వాలేదు. కానీ అవి మరింతగా పెరిగితే డిప్రెషన్‌లోకి వెళుతారు. ఈ మానసిక ఒత్తిడి కొన్ని వారాలు, నెలలపాటు కొనసాగుతుంది. కానీ అది తీవ్రంగా మారితే తల్లి, బిడ్డ ఇద్దరికీ ఇబ్బందిగా మారుతుంది. దీంతో పాటు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు ఈ 10 డేంజర్ లక్షణాలు మాత్రం కనిపించకూడదు. మరి ఏంటి లక్షణాలు అంటే..

1. పీరియడ్స్ అవ్వడం

గర్భం దాల్చినప్పుడు కొద్ది నెలలపాటు పీరియడ్స్ ఆగిపోతుంది. కానీ కొందరు మహిళల్లో మాత్రం గర్భం దాల్చిన తొలినాళ్లలో వెజినా నుంచి బ్లీడింగ్ కనిపిస్తుంటుంది. దాదాపు 20-30 శాతం మహిళల్లో లైట్ పింక్ లేదా డార్క్ బ్రౌన్ కలర్ లో స్రావం కనిపిస్తుంది. అలా గర్భం దాల్చిన తొలి నాళ్లలో స్వల్పంగా బ్లీడింగ్ కావడం అనేది సహజం. కానీ రక్తస్రావమైతే ముందు జాగ్రత్తగా డాక్టర్‌ను కలవడం మంచిది. గర్భం దాల్చిన 3-4 వారాల్లో లేదా సెక్స్ తర్వాత స్రావాలు కనిపించొచ్చు. కొన్నిసార్లు సాధారణ పరిస్థితుల్లోనూ బ్లీడింగ్ కావచ్చు. అలాగే కొంత మంది మహిళల్లో గర్భం దాల్చాక 6-12 రోజుల తర్వాత బ్లీడింగ్ జరగవచ్చు. కానీ ప్యాడ్స్ అవసరం అయ్యేంత స్రావం ఉంటే మాత్రం గర్భధారణ పోయిందని గమనించాలి. మొదటి మూడు నెలలు గడిచాక బ్లీడింగ్ కావడం ప్రమాదకరం. మూడు నెలల గర్భం తర్వాత స్వల్పంగా నైనా, ఎక్కువైనా.. బ్లీడింగ్ అయితే వెంటనే డాక్టర్‌ను కలవాలి.

2. భరించలేని తలనొప్పి

ప్రెగ్నెన్సీ టైమ్‌లో టెన్షన్‌ తలనొప్పి కూడా వేధిస్తుంది. దీని కారణంగా జర్వం, జలుబు, నిద్రలేమి, ఒత్తిడి, డిప్రెషన్, హార్మోన్ల మార్పులు, భుజాలు, మెడ, స్కాల్ప్, దవడల్లో కండరాలు బిగుతుగా ఉండటం వల్ల టెన్షన్ తలనొప్పి వస్తుంది. కనుక డాక్టర్ సలహతో వ్యాయామం, వార్మప్‌ ఎక్సఅర్‌సైజ్‌, మసాజ్‌తో ఈ టెన్షన్‌ తలనొప్పని తగ్గించవచ్చు.

3. పొట్ట నొప్పి

మహిళ గర్భం పొందిన తర్వాత రోజులు గడిచే కొద్ది యూట్రస్ పెద్దగా విస్తరించడం ప్రారంభం అవుతుంది. దీని వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అయితే రెండు, మూడవ త్రైమాసికంలో ఇలాంటి లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి లేదు.. అంతేకాదు పొట్ట ఉదరంలో నొప్పితో పాటు, రక్తస్రావం జరిగితే, పొట్ట ఉదరంలో తిమ్మిర్లు గా అనిపిస్తే , అది అబార్షన్ కు సంకేతం. గుర్తించి వెంటనే మీ గైనకాలజిస్ట్‌ను కలవాలి.

4. మూత్రం పోయేటప్పుడు నొప్పి/ మూత్రం తక్కువ రావడం

తరచూ మూత్ర విసర్జన చేయడం, దురద, యోనిలో మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించిన కూడా డాక్టర్‌ను కలిసి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయిందేమో చెక్ చేయించుకోవాలి.

5. భరించలేని ఛాతి/వెన్నునొప్పి

గర్భధారణ సమయంలో మహిళలు వచ్చే అనేక రకాల ఆరోగ్య సమస్యల్లో ఛాతీ నొప్పి, వెన్నునోప్పి సాధారణం. లోపల బేడి గ్రోథింగ్ అవుతున్న సమయంలో వెన్నులో నొప్పి మొదలవుతుంది. అందుకే ఛాతి నొప్పి వచ్చినప్పుడు మీరు వెంటనే బీపీని చెక్ చేసుకోండి. ఒకవేళ బీపీ పెరిగినా, తగ్గినా వెంటనే డాక్టర్లను సంప్రదించండి. గ్యాస్ వల్ల ఛాతి నొప్పి వస్తే.. ఇంటి చిట్కాల ద్వారా ఉపశమనం పొందొచ్చు. నిమ్మకాయ, నల్ల ఉప్పును నీటిలో కలుపుకుని తాగితే కాస్త రిలీఫ్ పొందుతారు. వెన్నునొప్పి భరించలేనంతగా ఉంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

6. ముఖం,కాళ్లు, పొట్ట వాపు రావడం

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ప్రతి మహిళ శరీరంలో మార్పులు కచ్చితంగా జరుగుతాయి. శరీరం వాపుగా ఉంటుంది. అదే విధంగా ముఖం, కాళ్లు ఇలా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా కాళ్ల వాపులు.. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొంతమంది స్త్రీలకు మూడు నెలలోనే కాళ్ల వాపులు ఉంటే.. మరికొంత మంది స్త్రీలకు ఏడు, ఎనిమిది నెలల్లో కాళ్ల వాపులు ఉంటాయి. ఇలా కాళ్ల వాపు ఉండడానే ఎడిమా అని అంటారు. అలాంటప్పుడు టైంకి నీరు తీసుకోవాలి. కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిండం అభివృద్ధికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కనుక మోతాదులో తీసుకొండి.

7. అరికాళ్ళు, అరచేతులు జిల రావడం

ప్రెగ్నెన్సీ టైమ్‌లో మహిళలు ఛాతి మీద పొత్తి కడుపు మీద దురదలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్క సారి దురద ని కంట్రోల్ చేసుకోలేక పోతుంటారు. శరీరంలో జరిగే వివిధ మార్పుల వలన ఈ సమస్య కలుగుతుంది. బ్లడ్ సప్లై పెరగడం..స్కిన్ స్ట్రెచ్ అవడం..హార్మోన్ లో మార్పులు..పొడి చర్మం..చర్మం మారడం, చిన్న చిన్న స్పాట్ ఒంటిమీద రావడం. ఇలాంటి జరగడం మూలంగా దురద వస్తుంది.

8. కడుపులో బిడ్డ సరిగ్గా తిరగకపోవటం..

గర్భం దాల్చిన ప్రతి మహిళకి శిశువు ఎదుగుదల గురించి తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 20 వారాల గర్భధారణ సమయంలో శిశువు 6. 5 అంగుళాలుగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అయిన దగ్గర్నుంచి ఒక్కో దశలో ఎదుగుదల బాగుంటుంది. ఈ నేపథ్యంలోనే 20వ వారంలో జుట్టు పొర వస్తుంది. దీంతో వారి శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది. పిల్లల చర్మం పల్చగా ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ మందంగా మారుతుంటుంది. ఈ దశలో శిశువు కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని తల్లులు గమనించాలి. వారు కడుపులో తన్నడం, సాగదీయడం, తిప్పడం చేస్తారు. అలా తమ పుట్టే పిల్లలు చేసే కదలికలని తల్లులు ఆనందంగా ఆస్వాదిస్తారు. కానీ ఇలాంటి మూమెంట్స్ కనుక కనపడకపోతే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించండి.

9. ఉమ్మనీరు/దుర్వాసన ఉన్న తేల్ల బట్ట అవడం

పొట్టలో బిడ్డ సౌకర్యంగా ఉండడానికి ఉమ్మనీరు చాలా అవసరం. ఈ నీరు బిడ్డకి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. ఒత్తిడి, దెబ్బ తగిలిన పిల్లలకు ఏం కాకుండా కాపాడుతుంది. గర్భసంచిలో బెలూన్‌ ఉండటంతో.. బయటి నుంచి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకుంటుంది. అమ్మ గర్భంలో బిడ్డకు రక్షణ కవచంగా ఉండే ఉమ్మనీరు తగినంత లేకపోయినా.. ఎక్కువయినా కడుపులోని బిడ్డకు సమస్యలు మొదలవుతాయి. నెలలు నిండుతున్న కొద్ది చాలా మందిలో ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు ఉంటాయి. కనుక ఉమ్మనీరు తక్కువ కాకుండా అందులో దుర్వాసన రావడం.. ముఖ్యంగా తేల్ల బట్ట అవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

10. కళ్ళు మసక బారడం/ కంటి ముందు పొరలాగా కనిపించడం

ప్రెగ్నెన్సీ టైంలో నిద్రలేమి సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. కంటి నిండా నిద్రపోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది ఈ టైం లో కొంత డిప్రెషన్ లోకి వెళతారు. బడిలో జరిగే మార్పుల కారణంగా అలా జరుగుతుంది. కనుక ఫోన్ ని చూడటం.. టీవీ చూడటం వంటివి చూడకూడదు. ఎక్కువ స్క్రీన్ సమయం చూడడం వల్ల కళ్లకు ఇబ్బంది అవుతుంది. డిజిటల్ స్క్రీన్ కంటి ఒత్తిడి కి దారి తీయవచ్చు. గర్భిణులు ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలి. కాలక్షేపం కోసం కొంత సమయం చూస్తే పర్వాలేదు కానీ అదేపనిగా చూడటం మంచిది కాదు.



Source link

Related posts

ఈ లక్షణాలు ఉన్న మగవారు జర జాగ్రత్త.. గుర్తించకపోతే ప్రమాదమే?

Oknews

Fashion:జడ బిల్లలు కాదండోయ్.. మీ జుట్టు అందంగా కనిపించాలంటే ఇవి పెట్టుకోవాలంట!

Oknews

వాళ్ల సంగీతం.. పర్యావరణ హితం.. ఏం చేస్తారో తెలుసా?

Oknews

Leave a Comment