ByGanesh
Fri 09th Feb 2024 12:32 PM
రజినీకాంత్ సినిమాకి ప్రేక్షకులు లేక షోస్ రద్దవడం, షేమ్ నిజంగా అవమానం. కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందిపడిన సూపర్ స్టార్ రజినీకాంత్ కి జైలర్ సూపర్ బ్లాక్ బస్టర్ చాలా హెల్ప్ అయ్యింది. జైలర్ సక్సెస్ ఒక్కసారిగా సూపర్ స్టార్ మార్కెట్ ని పదింతలు చేసింది. జైలర్ తర్వాత రజిని గెస్ట్ పాత్రలో తెరకెక్కిన లాల్ సలామ్ పై అంచనాలు భారీగా ఉంటాయనుకుంటే.. తెలుగులోనే కాదు, ఏ భాషలోనూ లాల్ సలామ్ పై బజ్ కనిపించలేదు.
తెలుగులో లాల్ సలామ్ వస్తుంది అంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ రోజు ఫిబ్రవరి 9న ఈగల్ తో పాటుగా విడుదలైన లాల్ సలామ్ చిత్రానికి థియేటర్స్ లో ఆడియెన్స్ లేక తెలుగు స్టేట్స్ లో పలు చోట్ల మార్నింగ్ షోస్ ని థియేటర్స్ వారు రద్దు చేసుకున్నారనే న్యూస్ సూపర్ స్టార్ ఫాన్స్ కి షాకిచ్చింది. సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేసినా అది అభిమానులకి పండగే కానీ ఇలా లాల్ సలామ్ ని చూడడానికి ప్రేక్షకులు థియేటర్స్ కి రాలేదు అంటే అది నిజంగానే పెద్ద అవమానమే.
కొన్ని చోట్ల షోస్ క్యాన్సిల్ అవడంతో టికెట్ బుక్ చేసిన కొంతమందికి సారి చెప్పి మరీ వారికి డబ్బులు రిఫండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్ – విక్రాంత్ సంతోష్ లు కీలక పాత్రల్లో కనిపించారు.
Lal Salaam shows canceled due to lack of audience:
Why Is Lal Salaam Getting Ignored?