ప్రేమ పేరుతో మోసం, అక్రమ సంబంధం, రేవ్ పార్టీ, డ్రగ్స్, చీటింగ్, హత్య, రెండో పెళ్లి.. ఇలా ఈమధ్యకాలంలో ఇండస్ట్రీలో ఈ మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆరోపణలు ఏవైనా ఆయా నటీనటులు మాత్రం వార్తల్లోకి ఎక్కుతున్నారు. తద్వారా సోషల్ మీడియాని ఎక్కువగా ఫాలో అయ్యే నెటిజన్లకు కావాల్సినంత కాలక్షేపం అవుతోంది. తాజాగా టాలీవుడ్‌లో వర్థమాన నటుడిగా చెప్పుకుంటున్న అమన్‌సింగ్‌పై అలాంటి కేసు నమోదైంది.
హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన ఓ యువతి అమన్ సింగ్ అనే నటుడు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అమన్ తనకు జిమ్‌లో పరిచయమయ్యాడని, అలా తమ మధ్య ప్రేమ పుట్టిందని చెబుతోంది ఆ యువతి. శారీరకంగా తనను వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మొహం చాటేస్తున్నాడని అంటోంది. అంతేకాదు, తామిద్దరం కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని తన కంప్లయింట్‌లో పేర్కొంది. దీంతో పోలీసులు అమన్‌సింగ్‌పై ఛీటింగ్, రేప్ కేసులు నమోదు చేశారు.