పాత కక్షలతో రౌడీ షీటర్ దారుణ హత్యరౌడీషీటర్(Rowdy Sheeter Murder) ను గొంతు కోసి దారుణంగా హత్య చేసిన సంఘటన పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..నగరంలోని కాలా పత్తర్ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ మొహమ్మద్ ఉస్మాన్ (36) ఏడాదికాలంగా పహాడ్ షరీఫ్ ఉమర్ కాలనీలోని దర్గాలో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం దర్గా నుంచి ఒకేసారి పెద్ద ఎత్తున కేకలు వినిపించడంతో స్థానికులు దర్గా లోపలకి ప్రవేశించి చూడగా ….రక్తపు మడుగులో ఉస్మాన్ ఉన్నాడు. కాగా దర్గా నుంచి ఇద్దరు దుండగులు పారిపోవడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే లోపే ఉస్మాన్ మృతి చెందాడు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించి నిందితుల కోసం గాలించారు. మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి, పహాడ్ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉస్మాన్ ను తీవ్రంగా కొట్టి గొంతు కోసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు పాత కక్షలే కారణమాని పోలీసులు భావిస్తున్నారు. అయితే 2009 -11 మధ్య కాలంలో మృతుడు ఉస్మాన్ పై చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెదిరింపులు, దోపిడీ, దాడి హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి.
Source link
previous post