Uncategorized

ప్రొద్దుటూరు బంగారం దుకాణాల్లో ఐటీ తనిఖీలు, 300 కిలోల గోల్డ్ సీజ్!-proddatur it checking in gold shop 300 kilo gold seized ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Proddatur Gold Shops : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల త‌నిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరులో నాలుగు బంగారం దుకాణాల్లో సరైన బిల్లులు లేని సుమారు 300 కిలోల‌ బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. తిరుపతి, విజ‌య‌వాడ‌కి చెందిన ఐటీ అధికారులు గత నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్‌, డైమండ్స్ దుకాణాలతో పాటు గురురాఘ‌వేంద్ర, త‌ల్లం దుకాణాల్లో త‌నిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అధికారులు భారీ ఎత్తున బంగారం సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారాన్ని ప్రత్యేక వాహనాల్లో తిరుపతికి తరలించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. సరైన బిల్లులు లేకుండా భారీ ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు తనిఖీల్లో ఐటీ అధికారులు గుర్తించారు. ప్రొద్దుటూరులో రెండు వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల దుకాణాలు పైగా ఉన్నాయి.



Source link

Related posts

CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, రెండ్రోజుల పర్యటన

Oknews

Nara Lokesh : చంద్రబాబును జైలులోనే చంపేస్తామంటున్నారు, నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

Oknews

Visakha Beach Tragedy: ఇంట్లోంచి పారిపోయి, కొండపై నుంచి కింద పడిన యువతి

Oknews

Leave a Comment