సినిమా వాళ్ళు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలోనే కాదు.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ ముందుంటారు అని ఇప్పటికే ఎందరో నిరూపించారు. అదే బాటలో సీనియర్ నటుడు విజయ్ కృష్ణ కూడా పయనిస్తున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ డబ్బింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ కి తన వంతుగా లక్ష రూపాయలు సాయం చేసిన నరేష్.. ఎవరికి తోచినంత సాయం వారు చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. “ప్రముఖ డబ్బింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు రెండేళ్లుగా రెగ్యులర్ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆయన భార్య శ్రీదేవి గారు కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అవసరమైన అన్ని పరీక్షలు పూర్తి చేసి త్వరలో సర్జరీకి ప్లాన్ చేస్తున్నారు. నేను నా వంతు సహకారం అందించాను. ఆయన త్వరగా కోలుకొని మనల్ని మళ్ళీ అలరించాలని కోరుకుంటున్నాను. నా స్నేహితులతో పాటు అందరూ తమకు తోచిన సాయం చేసి ఈ గొప్ప కార్యక్రమంలో భాగమవ్వాలని కోరుకుంటున్నాను.” అని నరేష్ రాసుకొచ్చారు.