Health Care

ఫిట్‌నెస్ ఫీట్లు.. అతి వ్యాయామంతో నష్టమేనంటున్న నిపుణులు


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలామందిలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుతోంది. కొందరు జిమ్ సెంటర్లకు వెళ్లి గంటల తరబడి వర్కవుట్స్ చేస్తుంటారు. మరికొందరు గ్రౌండ్‌లో ఎక్సర్‌సైజ్ మొదలుకొని జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ వరకు ట్రై చేస్తుంటారు. అయితే ఇలాంటి ఫిట్‌నెస్ ఫీట్లతో హెల్త్ ఇష్యూస్ కూడా తలెత్తుతున్నాయి. ఎక్కువ సేపు చేయడంవల్ల ఎముకలు విరగడం, డీ హైడ్రేషన్, శరీర ఆకృతిలో మార్పు, అస్థిరత వంటి ఇబ్బందులు తలెత్తే చాన్స్ ఉందంటున్నారు నిపుణులు.

ఓవర్ టైమింగ్‌

నిర్దిష్ట సమయానికి మించి లేదా నిరంతర వ్యాయామం బాడీకి కావాల్సిన విశ్రాంతి, పోషణ ఇవ్వదని, నిద్రలేమి సమస్యలకు కారణం అవుతుందని ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అవసరం మేరకు వర్కవుట్స్ వల్ల హ్యాపీనెస్‌‌ను పెంచే డొపమైన్‌ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కానీ అదే మితిమీరిన వ్యాయామం మాత్రం స్ట్రెస్, యాంగ్జైటీస్, టెన్షన్ వంటి స్థిరమైన మూడ్ స్వింగ్స్‌కు దారితీస్తుంది.

కంపల్సివ్ వర్కవుట్

కొన్నిసార్లు వర్కవుట్ కూడా అడిక్షన్‌గా మారుతుంది. ఈ పరిస్థితినే నిపుణులు కంపల్సివ్ వ్యాయామం అంటున్నారు. బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలని, అధిక బరువు తగ్గాలనే అబ్సెషన్ కొందరిలో వ్యసనానికి కారణం అవుతాయి. ఇవి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

సామర్థ్యానికి మించి..

సామర్థ్యానికి మించిన వర్కవుట్స్ చేసినప్పుడు ముఖ్యంగా బరువులు ఎత్తడం, మరీ ఎక్కువ వేగంతో పరుగెత్తడం వంటివి కండరాల నొప్పికి కారణం అవుతాయి. దీంతో బాధితుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, అలసట పెరగడం, కార్డియో వాస్క్యులర్ ఇష్యూస్ తలెత్తడం జరుగుతాయి. అలాగే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వంటివి కూడా రావచ్చు.

ఎంత సేపు చేయాలి?

మితిమీరిన కసరత్తులతో ప్రాణాల మీదకు రావచ్చు. అందుకే ఫిక్స్‌ చేయబడిన టైమింగ్స్‌లో వర్కవుట్స్ కంప్లీట్ చేసుకోవడం బెటర్. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం.. పెద్దలకు వారానికి 150 నుంచి 300 నిమిషాల మితమైన వర్కవుట్స్ మాత్రమే అవసరం. ఒకవేళ ఏరోబిక్స్‌పై ఆసక్తి ఉంటే వారానికి 75 నుంచి 150 నిమిషాల పాటు చేయవచ్చు.

ఇలా చేయడం బెటర్

శరీరానికి వ్యాయామం తప్పక అవసరం. ఫిట్‌గా ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ అది మీ శరీర సమతుల్యతను కాపాడేలా మాత్రమే ఉండాలంటున్నారు నిపుణులు. అందు కోసం బాడీ స్ట్రక్చర్‌ను బట్టి, సామర్థ్యాన్ని బట్టి కసరత్తు చేయాలి. ఇతరులను అనుకరించాలనో, కండరాలు తిరిగిన శరీర నిర్మాణంపై మోజుతోనో ఓవర్ టైమ్ వర్కవుట్స్ చేయకూడదు. అలాగే సమతుల్య ఆహారం తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం, తగినంత విశ్రాంతి, నిద్ర వంటివి కూడా చాలా ముఖ్యం.



Source link

Related posts

ఈ చిన్న చిన్న అడుగులే మీ కుటుంబ, ఆర్థిక విజయానికి సోపానాలు

Oknews

పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే గుండె పోటుకు సంకేతాలే!

Oknews

సమ్మర్‌లో విరేచనాలా.. ఈ నేచురల్ టిప్స్‌తో చెక్ పెట్టండి!

Oknews

Leave a Comment