Health Care

ఫుడ్ సర్వ్ చేస్తున్న అందమైన ఫిమేల్ రోబోట్.. ముచ్చట పడి టచ్ చేయగా..


దిశ, ఫీచర్స్ : ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఎన్నో సౌకర్యాలు ఏర్పడ్డాయి. అట్లనే అప్పుడప్పుడూ వింతలు, అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ప్రపంచమే అడ్వాన్స్‌డ్‌గా మారిపోయింది. మనుషులు చేయాల్సిన అనేక పనులు రోబోట్స్ చేసేస్తున్నాయి. హాస్పిటళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా హల్ చల్ చేస్తున్నాయి.

కస్టమర్లను ఆకట్టుకోవడానికి అందమైన అమ్మాయిలాంటి పోలికలతో కూడిన రోబోట్‌లను ఆయా బిజినెస్ హబ్‌లలో, మార్కెట్లలో ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్లలో అయితే వెల్కమ్ చెప్పడం మొదలు కొని ఫుడ్ సర్వ్ చేయడం వినియోగించుకోవడం కష్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో నిర్వాహకుల వ్యాపారం కూడా వృద్ధి చెందుతున్నది. అందుకే పెద్ద పెద్ద రెస్టారెంట్ల నిర్వాహకులు తమ వద్ద హ్యూమనాయిడ్ రోబోట్ సేవలు అందుబాటులో ఉన్నాయంటూ మరీ ప్రచారం చేసుకుంటున్నాయి.

రీసెంట్‌గా చైనాలోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురించి చేస్తోంది. వీడియోలోని సమాచారం ప్రకారం.. ఇక్కడ ఒక హ్యూమనాయిడ్ ఫిమేల్ రోబో వెయిట్రెస్‌గా(Waitress) సేవలు అందిస్తోంది. దాని నడక, అందం, కదలికలకు ఆకర్షితులై కష్టమర్ల సంఖ్య కూడా బాగా పెరిగిపోయిందట. కొందరు యువకులైతే ఆ రోబో సర్వ్ చేసిన ఫుడ్ తినడానికే అక్కడికి వస్తుంటారట. అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం, హొయలొలుకుతూ ఆహార పదార్థాలు అందించడం, తియ్యని మాటలు, హావ భావాలు చూసి ఇలా ఎంతోమంది ఫిదా అవుతున్నారు.

అయితే ఇటీవల రెస్టారెంట్‌కు వచ్చిన ఓ ఇద్దరు కష్టమర్లు ఆరోబోట్ అందాన్ని చూసి ముచ్చట పడ్డారు. ఒక్కసారైనా టచ్ చేయాలని భావించి దగ్గరికి వెళ్లి ఆ ప్రయత్నం చేయగా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే అది రోబోట్ కాదు. నిజంగానే అందమైన అమ్మాయి. తమ వ్యాపార అభివృద్ధికోసం నిర్వాహకులు ఒక మహిళను రోబోట్‌లా బిహేవ్ చేసేందుకు ట్రైనింగ్ ఇచ్చారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా యువతీ యువకులు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు.



Source link

Related posts

ఆ గుడ్ల ధర అక్షరాల రూ.24 లక్షలు.. ఇదే దాని స్పెషల్

Oknews

Biryani : బిర్యానీ అతిగా తింటున్నారా? మీ కోసమే ఈ సమాచారం!

Oknews

ఈ వ్యాధితో బాధపడుతున్నవారు బనానా చిప్స్‌ను తీసుకోకూడదు?

Oknews

Leave a Comment