ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) దర్యాప్తులో ప్రణీత్ రావు కీలక వాంగ్మూలం ఇచ్చారు. ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ఒప్పుకున్నారు. దీంతో ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు పేర్లను ఈ కేసులో చేర్చారు పోలీసులు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు కీలక సూత్రధారులను దర్యాప్తులో తెలిసింది. ప్రణీత్ రావుకు రాజకీయ నాయకుల, వ్యాపారుల ఫోన్ నెంబర్లు ప్రభాకర్ రావు, రాధా కిషన్ ఇచ్చేవారని విచారణ తేలిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రణీత్ రావు(Praneeth Rao) పేరును ఏ2గా చేర్చారు. విపక్ష నేతలతో పాటు ప్రముఖులు, వ్యాపారులు, జ్యువెల్లరీ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, హవాలా వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. దీనిని అదునుగా చేసుకుని ప్రణీత్ రావు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు.
Source link