దిశ, ఫీచర్స్ : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి జులై 12న జరనున్న విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు జరగాల్సిన వేడుకలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రతీ కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంటోంది. దేశ, విదేశాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులు, సినీ తారలు పాల్గొంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
రీసెంట్‌గా శుక్రవారం రాత్రి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ ఉత్సవం అంబరాన్నంటగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ వధూ వరుల డ్రెస్సింగ్ స్టైల్ మరింత స్పెషల్‌గా నిలిచింది. అనంత్ అంబానీ బంగారంతో తయారు చేసిన బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ బంద్ గాలా కోట్.. ప్యాంటు ధరించగా, రాధికా మర్చంట్ లైట్ బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ గల స్వరోవ్ స్కీ క్రిస్టల్స్‌తో తయారు చేసిన ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ అండ్ లెహంగాలో మెరిసిపోయింది. కాగా ఈ దుస్తులను ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లా రూపొందించగా అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రజెంట్ అనంత్ అండ్ రాధికా మర్చంట్ గోల్డెన్ డ్రెస్సింగ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా పలువురు క్యూరియా సిటీతో కామెంట్లు చేస్తున్నారు.