బడా బకాయిదారుల లిస్ట్ రెడీగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.100.92 కోట్ల పన్ను వసూలు లక్ష్యం కాగా.. రూ.44.5 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పన్ను వసూళ్లకు అడ్డంకులు ఏర్పడటంతో ఇంకా సగానికిపైగా పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతో వాటిని సకాలంలో వసూలు చేయడం అధికారులకు సవాల్ గా మారింది. ఇంత తక్కువ సమయంలో పన్ను వసూలు టార్గెట్ రీచ్ అయ్యేందుకు అధికారులు ప్లాన్ రెడీ చేశారు. ఈ మేరకు బిల్ కలెక్టర్లు, ఆర్ఐలకు రోజువారీ పన్నుల సేకరణ లక్ష్యాన్ని విధించారు. పురోగతి సాధించని పక్షంలో సిబ్బందిపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజు పన్నుల సేకరణను రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు పర్యవేక్షించాల్సిందిగా సూచించారు. దీంతో గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి మ్యుటేషన్ అయిన, కొత్త గృహాలను గుర్తించి అసెస్మెంట్, రివైజ్డ్ ట్యాక్స్ విధిస్తున్నారు. కమర్షియల్ ఫంక్షన్ హాల్స్, రెసిడెన్సియల్ నుంచి కమర్షియల్ గా మార్పు చెందినవాటిపైనా దృష్టి పెట్టా బల్దియా ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పన్నుల టార్గెట్ రీచ్ అయ్యేందుకు ముందుగా బడా బకాయిదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు వారందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అధికారులు బడా బకాయి దారుల లిస్ట్ రెడీ చేసి, పన్నులు క్లియర్ చేయించే పనిలో పడ్డారు. కాగా ఇంకో రెండు నెలల్లోనే ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఆఫీసర్లు అనుకున్న మేర టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి.
Source link
previous post