EntertainmentLatest News

బర్త్ డే రోజు మట్కాని గిఫ్ట్ గా ఇచ్చిన వరుణ్ తేజ్ 


ఈ రోజు ప్రముఖ హీరో వరుణ్ తేజ్ పుట్టిన రోజు..అభిమానులందరు మెగా ప్రిన్స్ గా పిలుచుకునే  వరుణ్  తన వివాహం తరువాత  జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు కూడా ఇదే. పైగా ఈ బర్త్ డే రోజున మెగా అభిమానులకి అదిరిపోయే గిఫ్ట్ ని కూడా ఇచ్చాడు.

వరుణ్ తేజ్ చేస్తున్న నయా మూవీల్లో మట్కా కూడా ఒకటి. ఈ రోజు వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా మట్కా గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.నిమిషంన్నర నిడివితో ఉన్న ఆ గ్లింప్స్ ని చూస్తుంటే వరుణ్ మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని అర్ధం అవుతుంది .అలాగే గ్లింప్స్ ని  చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చే విధంగా కూడా  ఉంది.  ఈ మట్కా కి ఉన్న ఇంకో స్పెషల్ ఏంటంటే వరుణ్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా  విడుదల కాబోతుంది. ఎ ప్పటికప్పుడు కొత్త రకం సినిమాలు చేసుకుంటే వెళ్లే వరుణ్ మట్కా తో హిట్ కొట్టడం ఖాయమని మెగా ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు.

పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మట్కా మీద ప్రేక్షకుల్లోను సినీ ట్రేడ్ వర్గాల్లోను మంచి అంచనాలే ఉన్నాయి. వరుణ్ తో  మీనాక్షి చౌదరి జత కడుతుండగా  ప్రముఖ కెనడియన్ డాన్సర్ అండ్ ఆర్టిస్ట్ అయిన నోరా ఫతేహి ముఖ్య పాత్రలో నటిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న మట్కాని  వైరా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై విజేందర్ రెడ్డి తీగల, రజని తాళ్లూరి లు నిర్మిస్తున్నారు.

 



Source link

Related posts

Interesting.. BJP also in Alliance? వామ్మో.. పొత్తులోకి బీజేపీ కూడానా?

Oknews

Amala Paul announces second marriage మళ్ళీ పెళ్లి అంటూ షాకిచ్చిన అమల పాల్

Oknews

Is Sohel Pawan the only one? సోహెల్ లా పవన్ కూడా అడగాల్సిందా?

Oknews

Leave a Comment