Health Care

బాదం నూనెతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..


దిశ, ఫీచర్స్ : డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పు కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. బాదం పప్పుని రోజువారి డైట్ లో తీసుకుంటే శరీరం, గుండె రెండూ ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పుతో అనేక చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యల నుంచి రిలీఫ్ కావచ్చు. అంతే కాదు నానబెట్టిన బాదంపప్పును ప్రతిరోజు తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణుల అభిప్రాయం. బాదం పప్పులో విటమిన్ ఇ, బి, బి 2, కొవ్వులు, ఒమేగా 3, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. బాదం పప్పు మాత్రమే కాకుండా బాదం నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాదం నూనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ నూనెతో అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి బాదం నూనెతో ఎన్ని ప్రయోజనాలను పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

మలబద్దకం నుండి ఉపశమనం..

చాలా మందికి మలబద్దకం సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఉదయం లేవగానే మోషన్ ఫ్రీ కాకుండా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు రాత్రిపూట పడుకోవడానికి ముందు గోరువెచ్చని పాలలో ఒక చెంచా బాదం నూనెను వేసుకుని తాగితే ప్రేగులలో ఉన్న మురికి పూర్తిగా తొలగిపోతుందని నిపుణుల అభిప్రాయం. దీంతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు.

చర్మం సంరక్షణ..

బాదం నూనెను రోజు రాత్రి నిద్రపోవడానికి ముందు ఫేస్ కి మర్దన చేసుకుని పడుకుంటే ముఖం పై మచ్చలు, ముడతలు తొలగిపోతాయట. అలాగే పొడిబారిన చర్మాన్ని కూడా అందంగా మృదువుగా చేసి ముఖానికి సహజ పద్దతిలో కాంతిని తెస్తుంది. అలాగే టానింగ్, మొటిమలు తొలగించి మంచి ఛాయను తెస్తుంది.

జుట్టు సంరక్షణలో..

బాదం నూనెను ఉపయోగించి జుట్టు సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారంలో రెండు సార్లు తలస్నానం చేయడానికి ముందు బాదం నూనెను జుట్టుకు రాసి 1.5 లేదా 2 గంటల పాటు ఉంచాలి. ఇలా చేస్తే జుట్టు కుదుళ్లు గట్టిగా అయ్యి జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. అంతే కాదు జుట్టు నల్లగా, అందంగా నిగనిగలాడేలా చేస్తుంది. అలాగే చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది. బాదం నూనెలో నిమ్మరసాన్ని కూడా వేసి అప్లై చేయవచ్చు.

ఎముకల దృఢత్వానికి..

చంటిపిల్లలకు బాదం నూనెతో మసాజ్ చేస్తే కండరాలు బలోపేతం అవుతాయట. అలాగే బాదం నూనెను పాలలో మిక్స్ చేసి తీసుకుంటే బలహీనంగా ఉన్న ఎముకలు బలంగా తయారవుతాయని చెబుతున్నారు. అలాగే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.



Source link

Related posts

షుగర్ పేషెంట్లు టీ తాగడం సురక్షితమేనా?

Oknews

జ్ఞాపకాలు వెంటాడుతున్నాయా?.. ఇలా అధిగమించండి !

Oknews

ఈ చెట్టు జాతికి 15 కోట్ల సంవత్సరాలు.. దాని సీక్రెట్స్ బయట పెట్టిన శాస్త్రవేత్తలు..

Oknews

Leave a Comment