posted on Jan 18, 2024 9:20AM
శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఆహారానిదే ప్రధాన పాత్ర. డ్రై ఫ్రూట్స్, నట్స్, పండ్లు, కాయలు, తృణధాన్యాలు అన్నీ ఆరోగ్యాన్ని చేకూర్చేవే. అయితే వేటిని ఎలా తినాలో అలా తింటే ఆరోగ్యానికి మరింత మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. ఎండు గింజలలో బాదం పప్పుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బాదం పప్పును నానబెట్టి తింటే శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి. అయితే బాదం పప్పును ఏ సమయంలో తింటే శరీరానికి ఎక్కువ లాభాలు ఉంటాయి? బాదం పప్పులో ఉండే పోషకాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..
ప్రతిరోజూ నానబెట్టిన బాదం పప్పు తినడం ముఖ్యంగా కరోనా దాడి పెరిగింది. చాలామంది ఆరోగ్యం మీద స్పృహతో బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే తింటారు. బాదంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఫైబర్, కార్భోహైడ్రేటెడ్లు కూడా ఉంటాయి. శరీరానికి పోషణ ఇవ్వడం నుండి బరువు తగ్గడం వరకు ఇవి ఎన్నో విధాలుగా సహాయపడతాయి. అయితే బాదం పప్పులు ఏ సమయంలో తింటే ఏం జరుగుతుందో? ఎప్పుడు తింటే ఎక్కువ లాభాలు ఉంటాయో చాలామందికి తెలియదు.
సాధారణంగా అందరూ తిన్నట్టు ఉదయం సమయంలో నానబెట్టిన బాదం పప్పును పొట్టు తీసి తినడం వల్ల గరిష్ట ప్రయోజానాలు ఉంటాయి. రోజు మొత్తం శక్తివంతంగా ఉంచుతుంది. ఉదయాన్నే శరీరానికి అవసరమైన పోషకాలు లభించడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది.
వ్యాయామం చేసే అలవాటు ఉంటే వ్యాయామానికి ముందు బాదం పప్పు తినడం వల్ల శరీరం తొందరగా అలసిపోదు. దీని వల్ల ఎక్కువసేపు అలసట లేకుండా వ్యాయామం చెయ్యడానికి వీలుంటుంది. బాదం పప్పు కండరాలకు మేలు చేస్తాయి. ఈ కారణంగా వ్యాయామం తరువాత కూడా కండరాలు అలసిపోవు.
సాయంత్రం స్నాక్స్ తీసుకునే సమయంలో నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా సాయంత్రం ఆయిల్ ఫుడ్, ఉప్పు, కారం జోడించిన ఆహారాలు లేదా పంచదారతో కూడిన పదార్థాలు స్నాక్ గా తింటుంటారు. వీటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. వీటి బదులు సాయంత్రం బాదం పప్పులు తింటే రాత్రి భోజనం వరకు ఆకలి వేధించదు.
బాదం పప్పు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కారణంగా షుహర్ కూడా అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం.
*నిశ్శబ్ద.