చిరంజీవి హీరోగా 1984 లో ఛాలెంజ్ అనే మూవీ వచ్చింది. అందులో చిరుకి రూపాయి సహాయం చేసే బిచ్చగత్తె పాత్రని పోషించిన నటి పావలా శ్యామల. సినిమా పరిశ్రమతో ఆమెకి ఉన్న అనుబంధం నాలుగు దశాబ్దాల పైనే. రెండు తరాల నటుల్ని చూసిన ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పావలా శ్యామల ఇటీవల ఒక ఛానెల్ లో ప్రసారం అయ్యే షో కి గెస్ట్ గా వెళ్ళింది. తన లైఫ్ లో ఎదుర్కున్న సినీ కష్టాలు గురించి చెప్పింది. దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లో నటించాను. గౌరవమర్యాదలు కూడా అందుకున్నాను. కానీ ఇప్పుడు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే తన కష్టాలను చెప్పి ఎవర్ని బాధపెట్టాలని రాలేదని, మిమ్మల్ని మళ్ళీ చూస్తానో లేదోనని ఒకసారి అందరికీ కనిపించాలనే ఉద్దేశంతోనే వచ్చానని చెప్పింది .
పావలా శ్యామల గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతుంది. ఆరోగ్యం కూడా క్షిణించింది. ఇంకా చెప్పాలంటే పూట గడవటం కూడా కష్టంగా మారింది.చాలా సందర్భాల్లో సినీ పెద్దలు ఆమెకి ఆర్ధిక సహాయం కూడా చేసారు. ఆవిడే చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో నటించినా కూడా ఆర్థికంగా స్థిరపడలేకపోయాను అని చెప్పింది.