EntertainmentLatest News

బాలకృష్ణ కి తల్లిగా చేసిన నటికి చిరంజీవి కొత్త సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్!


2005 లో మలయాళంలో వచ్చిన బాయ్ ఫ్రెండ్ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ మీద మెరిసిన భామ హనీ రోజ్.ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి  సుమారు ముప్పైకి  పైగా చిత్రాల్లో నటించింది. 2008 లో రాజశేఖర్ హీరోగా తెలుగులో వచ్చిన ఆలయంలో కూడా ఆమె నటించింది. లేటెస్ట్ గా  2023  సంక్రాంతికి బాలకృష్ణ  హీరోగా వచ్చిన  వీరసింహరెడ్డి లో  నటించింది.బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించిన  ఆ మూవీలో ఒక బాలకృష్ణకి తల్లిగా ఇంకో బాలకృష్ణ కి ప్రేయసిగా హనీ చాలా అధ్బుతంగా నటించి ప్రేక్షకుల దృష్టిలో మంచి మార్కులనే కొట్టేసింది. తాజాగా ఆమెకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న నయా మూవీ కొంత కాలం క్రితం ప్రారంభమయిన  విషయం అందరికి తెలిసిందే. మెగా 156 గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హనీ రోజ్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.కాకపోతే ఈ విషయాన్ని హనీ గాని  చిత్ర యూనిట్ గాని అధికారకంగా ప్రకటించలేదు. కానీ చిరు సినిమాలో హనీ నటించడం ఖాయమయితే కనుక హనీ సినీ దశ తిరిగినట్టే అని ఫిలిం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న  మెగా 156 లో  చిరంజీవి సరసన నటించే నటీమణుల విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే  అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్,తమన్నా, నయనతార వంటి హీరోయిన్ల పేర్లు బయటకి వచ్చాయి. తాజాగా వీళ్ళ సరసన  హనీ కూడా చేరింది.విశ్వంభర అనే టైటిల్ మెగా కొత్త చిత్రానికి పరిశీలనలో ఉంది.

 



Source link

Related posts

ఇది కదా మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ అంటే!

Oknews

Bramayugam OTT release date locked మమ్ముట్టి భ్రమయుగం ఓటీటీ డేట్ ఫిక్స్

Oknews

BRS కు షాక్..కాంగ్రెస్ లో చేరిన ఎంపీ.!

Oknews

Leave a Comment