అదేం విచిత్రమో గాని ఎప్పుడు చూసినా బాలకృష్ణ సినిమా రిలీజ్ డేట్ విషయం గురించే చర్చ నడుస్తు ఉంటుంది. తన మానాన తాను మూవీ స్టార్టింగ్ రోజే ఒక డేట్ ని ఫిక్స్ అవుతాడు. పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా పోటీ లేకుండా చూస్తాడు. కానీ ఇప్పుడు బాలయ్య పోటీకి దిగక తప్పదేమో అనే వాతావరణం కనపడుతుంది. లేదంటే ఆయన ముందు రెండు అప్షన్లు ఉన్నాయి.
బాలకృష్ణ 109 వ చిత్రం షూటింగ్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రారంభం కానుంది. బాలయ్య ఎన్నికల హడావిడిలో ఉండటంతో ఇతర ఆర్టిస్టులకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసారు.ఇక ఇప్పుడు బాలయ్య డేట్స్ ఇవ్వడం ఆలస్యం మిగతా షూటింగ్ ని కూడా కంప్లీట్ చెయ్యడమే. బాలయ్య కూడా అసెంబ్లీ సమావేశాలు తర్వాత వరుస షెడ్యూల్స్ లో షూటింగ్ ని కంప్లీట్ చెయ్యబోతున్నాడు.వాల్తేరు వీరయ్య బాబీ దర్శకుడు కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అసలు విషయంలోకి వస్తే డిసెంబర్ లో విడుదల లక్ష్యంగా బాబీ అండ్ టీం 109 ని స్టార్ట్ చేసింది. కానీ ఎప్పుడైతే పుష్ప 2 లాండింగ్ ఆగస్టు నుంచి డిసెంబర్ 6 కి వెళ్లిందో ఒక్కసారిగా అందరి ప్లానింగ్స్ వెయిటింగ్ లిస్ట్ లో పడ్డాయి.
ఆఫ్ కోర్స్ బాలయ్య రెండు వారాల గ్యాప్ తర్వాత రావచ్చు. కానీ ఆ టైం లో నాగ చైతన్య తండేల్,నితిన్ రాబిన్ హుడ్ లు ఉన్నాయి. ఆల్రెడీ రాబిన్ హుడ్ ని డిసెంబర్ నుంచి కొంచం ముందుగానే నవంబర్ కి జరపాలనే ప్లాన్ లో ఉన్నారనే టాక్ నడుస్తుంది.ఇక తండేల్ ఉంటుంది. అల్లు అరవింద్ నిర్మాత కాబట్టి బాలయ్య అరవింద్ లకి ఉన్న సాన్నిహిత్యం తో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. అసలు ఎందుకు ఈ డిస్కర్షన్ అంతా. బాలయ్య కి ఎలాగు సంక్రాంతి మొనగాడు అనే పేరు ఉంది. అప్పుడు రావచ్చు కదా అని అనుకుందామంటే మాస్ మాహారాజ రవితేజ మూవీ ఉంది. కొన్ని రోజుల క్రితం భాను భోగవరపు డైరెక్షన్ లో చెయ్యడానికి రవి తేజ పచ్చ జెండా ఊపాడు. షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.2025 సంక్రాంతే లక్ష్యంగా షూటింగ్ జరుగుతుంది. బాలయ్య, రవితేజ గతంలో చాలా సార్లు పోటీగా వచ్చినా ఈ సారి మాత్రం రారు. ఎందుకంటే ఆ ఇద్దరి సినిమాలని నిర్మిస్తుంది ఒకరే. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైనేమెంట్స్ ఆ రెండు చిత్రాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తుంది. సో పోటీగా రారు. ఏది ఏమైనా కాలానికి సినిమా కూడా అతీతం కాదు కాబట్టి. ఏం జరుగుతుందో చూద్దాం. అదే విధంగా పెద్ద సినిమాల విడుదల తేదీ ఈక్వల్ టూ సస్పెన్స్ మూవీ అనేది మాత్రం వాస్తవం.