EntertainmentLatest News

బాలకృష్ణ చిన్న అల్లుడు ఇరగదీస్తున్నాడు 


వారసత్వానికి ఒక క్రేజ్ ని,  స్టార్ డమ్ తెచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ(balakrishna)విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు(ntr)నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి నేడు తెలుగు సినిమా పరిశమ్రలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన ప్రతి సినిమా కూడా ఇది మా బాలయ్య సినిమా అని అభిమానులు గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటుంది. అలాగే గత పదేళ్ల నుంచి రాజకీయాల్లోను మంచి పనులు చేస్తు అభిమానులకి గర్వకారణంగా కూడా ఉన్నాడు.  ప్రస్తుతం మూడో సారి ఎంఎల్ ఏ గా కొనసాగుతూ ఉన్నాడు. ఇక  అభిమానులు బాలయ్యని ఎంతగా అభిమానిస్తారో ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా అంతే ఇదిగా అభిమానిస్తారు. ఈ విషయం చాలా సందర్భాల్లో  రుజువయ్యింది. బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్(nara lokesh)  రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా ముందుకు దూసుపోతున్నాడు. ఇప్పుడు చిన్న అల్లుడు కూడా డైనమిక్ లీడర్ అని అర్ధమవుతుంది. 

బాలకృష్ణ రెండవ  అల్లుడు పేరు భరత్. పూర్తి పేరు మతుకుమిల్లి  శ్రీ భరత్(sri bharat)మొన్న జరిగిన ఆంధ్ర ప్రదేశ్  ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపి గా గెలుపొందాడు. లేటెస్ట్ గా  మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి  తనదైన స్టైల్లో జవాబులు ఇచ్చాడు. దీంతో బాలకృష్ణ అల్లుడు అంటే ఇంతే ఉంటుందని అందరు  అనుకుంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ అయితే  గర్వ పడుతున్నారు. భరత్  మాట్లాడుతు గత ప్రభుత్వ పెద్దలు పేదలకి పెత్తందార్లకి మధ్య పోటీ అని అనేవారు. నిజంగా వాళ్లే పెత్తందార్లు. అందుకే పేదలకి  ఉచితంగా దొరికే ఇసుకని డబ్బులకి అమ్ముకున్నారు.కానీ మా కూటమి ప్రభుత్వంలో నిస్పక్షపాతంగా ఉచితంగా అందేలా చేస్తాం.  అదే విధంగా విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ని తప్పకుండా కాపాడుకుంటాం. ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్రంతో పోరాడతాం.

 కాకపోతే ఇప్పుడు మేము కూటమిలో ఉన్నాం. కాబట్టి పోరాటం రూటు వేరుగా ఉంటుంది.ఎందుకంటే ప్రతిపక్షంగా ఉంటే ప్రశ్నించేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వం లో ఉన్నాం కాబట్టి బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రస్థుతానికి  20000 కోట్ల రూపాయిల అప్పుతో  స్టీల్ ప్లాంట్ ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే గత ప్రభుత్వంలో మాంగనీస్ మైనింగ్ ఆగిపోయింది. గత ప్రభుత్వం తమ  దోపిడీ కోసం పర్మిషన్ ఇవ్వలేదు.  రాబోయే రోజుల్లో అది ప్రజలకి అందుబాటులో ఉంటుంది. టోటల్ గా రాబోయే రోజుల్లో   మా కూటమి గవర్నమెంట్ ట్రీట్ మెంట్ వేరుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు .అదే విధంగా రైల్వే జోన్ స్థలానికి సంబంధించిన విషయం గురించి కూడా చెప్పుకొచ్చాడు.  బాలకృష్ణ రెండవ కూతురు  తేజశ్వని  భర్తే  శ్రీ భరత్.

 



Source link

Related posts

Kakatiya University has released TS ICET 2024 Notification check application and exam dates here | TS ICET: టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల

Oknews

CM Revanth Reddy Bahubali: బాహుబలి సినిమాలో కాలకేయుడి పాత్ర వేసిన ప్రభాకర్ ది సీఎం ఊరేనంట..!

Oknews

Megastar Chiranjeevi Valentines Day Special ప్రేమికుల రోజు.. బెటర్ హాఫ్‌‌తో చిరు

Oknews

Leave a Comment