EntertainmentLatest News

బాలయ్యకి రచ్చ రవి దసరా దావత్.. ఇదెక్కడి ప్రేమరా మావ!


నటసింహం నందమూరి బాలకృష్ణకి ఎందరో అభిమానులు ఉన్నారు. వారిలో సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు. కమెడియన్ రచ్చ రవికి బాలయ్య అంటే ఎంతో అభిమానం. తాజాగా ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రచ్చ రవి స్పీచ్ కి, బాలయ్య మీద చూపించిన ప్రేమకి.. బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా ఫిదా అయ్యారు.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న వరంగల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో రచ్చ రవి స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

“నాకు రాజులు ఎలా ఉంటారో తెలీదు కానీ సినీ పరిశ్రమలో నేను చూసిన రాజు మాత్రం బాలయ్య బాబే. రాజు అంటే రాజ్యం ఉన్నోడో, బలగం ఉన్నోడో కాదు.. ధైర్యాన్ని ఇచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు, శక్తిని ఇచ్చేవాడు. బాలయ్య ఉంటే ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ ధైర్యంగా ఉంటుంది. బాలయ్య మంచి మనసున్న వ్యక్తి. ఆయన నా రాముడు, నా చిన్ని కృష్ణుడు. మా అమ్మ బాలయ్యని ఇంటికి తీసుకురా తలకాయ కూర వండి పెడదాం అన్నది. బాలయ్య బాబు మన ఇంటికి వస్తాడా అన్న. మా అమ్మ బాలయ్య కోసం తలకాయ కూర, బోటీ కూర అన్నీ వండుకొని వచ్చింది. అన్నకి దసరా దావత్ నాతోనే షురూ” అంటూ రచ్చ రవి తన తల్లిదండ్రులను బాలకృష్ణ దగ్గరకు తీసుకొని వెళ్ళి, బాలయ్య కోసం ప్రత్యేకంగా వండుకొని తెచ్చిన ఫుడ్ ని అందించాడు. ఆ సమయంలో బాలయ్య ఎంతో సంతోషంగా కనిపించాడు.



Source link

Related posts

Taapsee getting married to her boyfriend పెళ్ళికి సిద్ధమైన మరో హీరోయిన్

Oknews

Nayanthara Charges 5 Crores ఒకే ఒక్క సీన్ కోసం నయన్ కి 5 కోట్లు

Oknews

In Pics: హిందూ పద్ధతిలోనూ రాజారెడ్డి పెళ్లి – సంబరంలో వైఎస్ షర్మిల, విజయమ్మ

Oknews

Leave a Comment