Entertainment

బాలయ్యా మజాకా.. సీనియర్ స్టార్స్ లో ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు


నటసింహం నందమూరి బాలకృష్ణకి రికార్డులు కొత్త కాదు. అప్పట్లో తెలుగునాట ఎన్నో సంచలన రికార్డులు సృష్టించారు. అయితే ఇప్పుడు యూఎస్ మార్కెట్ లోనూ సత్తా చాటుతున్నారు. యూఎస్ లో హ్యాట్రిక్ వన్ మిలియన్ డాలర్ మూవీస్ ఉన్న తొలి తెలుగు సీనియర్ హీరోగా అరుదైన రికార్డ్ సృష్టించారు.

గత రెండు చిత్రాలు ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’తో యూఎస్ లో 1 మిలియన్ మార్క్ అందుకున్న బాలయ్య.. ఇప్పుడు ‘భగవంత్ కేసరి’తో మరోసారి ఆ ఫీట్ సాధించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. యూఎస్ లోనూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగు రోజుల్లోనే యూఎస్ లో వన్ మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి, బ్రేక్ ఈవెన్ సాధించి.. 1.5 మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.

యూఎస్ లో హ్యాట్రిక్ వన్ మిలియన్ డాలర్ మూవీస్ ఉన్న తొలి తెలుగు సీనియర్ స్టార్ గా బాలయ్య నిలిచాడు. సీనియర్ స్టార్స్ లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఎవరూ ఇప్పటిదాకా ఈ ఫీట్ సాధించలేదు.



Source link

Related posts

‘వళరి’ మూవీ రివ్యూ

Oknews

చిరంజీవి, సందీప్ రెడ్డి గెలుస్తారా!   

Oknews

సమంత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుందా!..వైరల్ అవుతున్న పిక్

Oknews

Leave a Comment