EntertainmentLatest News

బాలీవుడ్ స్టార్ తో టాలీవుడ్ డైరెక్టర్ మూవీ.. మైత్రినా మజాకా..!


మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ప్రకటించిన నాలుగో సినిమా అధిక బడ్జెట్ కారణంగా పట్టాలెక్కని సంగతి తెలిసిందే. ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న రవితేజ, గోపీచంద్ ఎంతో ఉత్సాహంగా నాలుగోసారి చేతులు కలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఘనంగా లాంచ్ అయింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని మైత్రి ప్లాన్ చేసింది. అయితే రవితేజకు పాన్ ఇండియా మార్కెట్ లేదు. ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి సినిమాలతో ఆయన చేసిన పాన్ ఇండియా ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం రవితేజ మార్కెట్ తో పోలిస్తే సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుండటంతో.. మైత్రి మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కి బ్రేకులు వేసింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లోకి రవితేజ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ వచ్చినట్లు ఆమధ్య వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయని తెలుస్తోంది.

గతేడాది ‘గదర్ 2’తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు సన్నీ డియోల్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. దీంతో సన్నీతో సినిమా చేయడానికి నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పలు నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సన్నీ డియోల్.. అనూహ్యంగా మైత్రి బ్యానర్ లో తెలుగు సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. మలినేని చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన సన్నీ.. ఈ ప్రాజెక్ట్ కి వెంటనే ఓకే చెప్పినట్లు వినికిడి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుందట. మలినేని-మైత్రి ప్రాజెక్ట్ అంటే ఎలాగూ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. బాలీవుడ్ స్టార్ తోడైతే నార్త్ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడుతుందన్న ఉద్దేశంతో సన్నీ డియోల్ ని రంగంలోకి దింపుతున్నారట.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తాజాగా మైత్రి మూవీ మేకర్స్ హింట్ ఇచ్చింది. మార్చి 13న గోపీచంద్ మలినేని పుట్టినరోజు కావడంతో.. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన మైత్రి సంస్థ.. మలినేని దర్శకత్వంలో ఒక భారీ సెన్సేషనల్ ప్రాజెక్ట్ రూపొందనుందని, త్వరలోనే ప్రకటన రానుందని తెలిపింది. ఈ లెక్కన గోపీచంద్ మలినేని-సన్నీ డియోల్ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.



Source link

Related posts

డైరెక్టర్ కాకముందు నాగ్ అశ్విన్ నటించిన సినిమాలేవో తెలుసా..?

Oknews

Crazy news on Prabhas Kalki avatar ప్రభాస్ కల్కి అవతారాలపై క్రేజీ న్యూస్

Oknews

బాలీవుడ్ ఫిల్మ్ సైన్ చేసిన రామ్ చరణ్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్..!

Oknews

Leave a Comment