రెబల్ స్టార్ ప్రభాస్ కి, ఎస్ఎస్ రాజమౌళి కి బాహుబలి ద్వారా వచ్చిన గుర్తింపు అందరకి తెలిసిందే. అదే టైం లో తెలుగు వారి కీర్తిని కూడా విశ్వవ్యాప్తం చేసింది.అలాంటి బాహుబలిని నిర్మించిన సంస్థ ఆర్కా మీడియా. దాని అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. ఆ మూవీతో ఇండియా వైడ్ గా ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ కూడా అయ్యారు.ఇక లేటెస్టుగా శోభు చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.
శోభు తన ట్విట్టర్ ద్వారా ఒక కీలక అప్ డేట్ ని అందించాడు. ఆర్కా మీడియా వర్క్స్ నుంచి ఒక ఎగ్జైటింగ్ వార్త రాబోతుందని కాకపోతే ఆ న్యూస్ ఏంటనేది రేపు రివీల్ చేస్తామని చెప్పాడు. దీంతో ఇప్పుడు శోభు ఒక భారీ ప్రాజెక్ట్ నే అనౌన్స్ చేయబోతున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. గతంలో యంగ్ హీరో రోషన్ తో ఓ ప్రాజెక్ట్ కి ఆర్కా ప్లాన్ చేసింది. దాని గురించే చెప్తారని కొందరు అంటుంటే అదేం కాదు వేరే ప్రాజెక్ట్ అని అంటున్నారు.పాన్ ఇండియా స్టార్ తో సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఏదైతేనేం ఒకే ఒక ట్వీట్ తో ఇప్పుడు శోభు వైరల్ గా మారాడు
ఇక ఆర్కా మీడియా గతంలో వేదం, మర్యాద రామన్న, అనగనగ ధీరుడు, పంజా, శ్రీలీల, రోషన్ ల పెళ్లి సందడిని నిర్మించింది.అభిరుచిగల సంస్థగా ఆర్కా కి మంచి పేరు ఉంది. ఆ సంస్థ నుంచి బాహుబలి లాంటి సినిమాలు మరిన్ని రావాలని చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు.