దిశ, ఫీచర్స్: ప్రజెంట్ డేస్‌లో టాటూస్ ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. ప్రతి ఒక్కరు తమ శరీరాలపై టాటూలు వేయించుకుంటున్నారు. అలాగే వాటి వెనుక ఏదో ఒక అర్థం వచ్చేలా.. వాటిని ముద్రించుకుంటారు. కొంత మంది పేరెంట్స్ పేర్లు, ప్రేమించిన వ్యక్తి గుర్తుగా వారి పేర్లను, చిత్రాలను కూడా టాటూస్ రూపంలో శరీరాలపై వేసుకుంటారు. కానీ ఈ ఫ్యాషన్ వెనుక ఓ సమస్య కూడా ఉందని తాజాగా ఓ సర్వేలో తేలింది.
అయితే.. నిజానికి కొందరు వ్యక్తులు ఇంట్రస్ట్‌తో టాటూలు వేయించుకుంటే.. మరికొందరు మాత్రం ఎమోషన్‌గా వేయించేసుకుంటారు. ఇక కొన్ని డేస్ లేదా.. ఏదైనా ఇతర కారణం చేత దానికి రిమూవ్ చేయించుకోవాలని చూస్తారు. ప్రజెంట్ అలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెబుతుంది తాజా సర్వే. కానీ వేయించుకున్నంత ఈజీగా టాటూ రిమూవ్ చెయ్యలేరు. దీంతో విచారం చెందుతారు. ఇందులో భాగంగా టాటూలు వేయించుకున్న పత్రి నలుగురిలో ఒకరు ఆ విషయంపై తీవ్రమైన భావోద్వేగానికి లోనవుతున్నారని తాజా సర్వేలో తేలింది. అలాగే వాటిని తొలగించే మార్గం కోసం.. ‘బెస్ట్ టాటూ క్లీనిక్స్’ అంటూ గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారని తెలిపింది ఆ సర్వే. కాగా… టాటూలను తొలగించుకోవాలని అనుకునేవారు ఎక్స్‌పెక్ట్‌ను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.