Health Care

బీ కేర్ ఫుల్ : రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అతిగా తింటున్నారా..


దిశ, ఫీచర్స్ : ఇప్పుడున్న యూత్ బయట ఫుడ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొందరైతే రూమ్‌లో వంట చేసుకోవడేమే మానేసి రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటూ కాలం గడిపేస్తున్నారు. అయితే ఇలా బయట ఫుడ్ తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే ఆహారపదార్థాల్లో అజినమెటో,మెనోసోడియం గ్లుటమేట్ అనే రసాయనాలు ఉంటాయంట. వీటి వలన అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందంట.

రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా తినడం వలన మహిళలు, పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే మధుమేహం, థైరాయిడ్, ఊబకాయం లాంటివి కూడా వస్తాయంట. అంతే కాకుండా హోటల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన మైగ్రేన్ లాంటి సమస్యలు వస్తాయి. ఈ ఆహార పదార్థాల్లో ఉండే అజినమోటో నాడి వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఎక్కువ ఉంటుందంట. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వలన ఒల్లంతా మొద్దుబారినట్లు అనిపించడమే కాకుండా నరాల బలహీన కూడా ఏర్పడే అవకాశం ఉందని, అందువలన రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు.



Source link

Related posts

ఉచితంగా మేకల పంపిణీ.. ఎన్నికావాలంటే అన్ని తెచ్చుకోవచ్చట..

Oknews

Sleeping : నోరు తెరిచి నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Oknews

రాత్రిపూట ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Oknews

Leave a Comment