Health Care

బెండకాయ ఆరోగ్యానికే కాకుండా ముఖానికి కూడా.. ఇలా ట్రై చేయండి


దిశ, ఫీచర్స్: ప్రతి ఒక్కరూ అందరూ ఉండాలని కోరుకుంటారు. కానీ, కొందరికి ముఖంపై మొటిమలు, మచ్చలు ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల బయటకు రావడానికి కూడా భయపడతారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు డబ్బులు ఖర్చు పెట్టి మందులు వాడుతుంటారు. అయితే, వాటిని ఎక్కువగా తీసుకోవడం మీ ఆరోగ్యానికే ప్రమాదం. మీ ముఖం మీద మొటిమలు నల్ల మచ్చలతో బాధపడుతున్నట్లయితే బెండకాయతో తగ్గించుకోవచ్చు. ఇది వాడటం వల్ల మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. లేడీ ఫింగర్ ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

లేడీస్ ఫింగర్ ఫేస్ ప్యాక్

6 బెండకాయలను కడిగి శుభ్రం చేసుకుని తీసుకోండి. ఆ తర్వాత వాటిని మిక్సీలో బాగా గ్రైండ్ చేసి, పెరుగు, ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మెత్తని పేస్ట్ కి కొంచం నీటిని కూడా పోయాలి. ఈ ఫేస్ మాస్క్‌ని మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. కొంత సమయం తర్వాత కడగాలి. ఇలా చేయడం వలన ముఖం మెరుస్తుంది.

లేడీ ఫింగర్స్ యొక్క ప్రయోజనాలు

లేడీ ఫింగర్స్ రుచికి మాత్రమే కాకుండా మీ చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఎందుకంటే వీటిలో విటమిన్లు ఎ , సి , కె వంటి పోషకాలను కలిగి ఉంటుంది. ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. లేడీ ఫింగర్ ఫేస్ ప్యాక్ మొటిమలను రాకుండా చేస్తుంది. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.



Source link

Related posts

పెళ్లి పేరుతో మోసం చేస్తున్న అబ్బాయిలు.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన నిపుణులు

Oknews

పీరియడ్ లీవ్.. అవసరమా? కాదా? | About Menstrual Leave

Oknews

వర్షాకాలంలో కంటి సమస్యలు.. ఇన్ఫెక్షన్ల నివారణకు ఏం చేయాలంటే..

Oknews

Leave a Comment