Health Care

బోర్న్‌విటా హెల్త్ డ్రింక్స్ కాదా?.. అసలు ఇవి పిల్లలకు అవసరమేనా?


దిశ,ఫీచర్స్: బోర్న్‌విటా “హెల్త్ డ్రింక్స్” కాదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బోర్న్‌విటా (హెల్త్ డ్రింక్స్) తో సహా ఇతర పానీయాలను, ఆరోగ్య పానీయాల నుండి తొలగించింది. చాక్లెట్ పౌడర్ కలిపిన పాలు ఇవ్వడం పిల్లలకు ఆరోగ్యకరమైనదా అనే ప్రశ్న తలెత్తుతుంది. పిల్లలకు ఇది నిజంగా అవసరమా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాక్లెట్ పౌడర్ యొక్క ప్రమాదాలపై నిర్దిష్ట అధ్యయనాలు లేవు. ఈ పౌడర్ ను మంచి కంపెనీ ఉత్పత్తి చేస్తే పెద్దగా నష్టాలు రావు. అంతర్జాతీయ ఆరోగ్య ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని పెద్ద కంపెనీలు దీనిని ఉత్పత్తి చేస్తాయి.

అయితే, తల్లిదండ్రులు తమ పిల్లలకు చాక్లెట్ పౌడర్ ఇచ్చేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు కొనుగోలు చేసేటప్పుడు పెట్టె లేదా బ్యాగ్ వెనుక ఉన్న పదార్థాల జాబితాను జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ఈ చాక్లెట్ పౌడర్లలో (హెల్త్ డ్రింక్స్) కృత్రిమ రసాయనాలు జోడించబడి ఉండవచ్చు. ప్రతి కంపెనీ ప్రొడెక్ట్ వివరాలను అట్ట మీద ప్రింట్ చేస్తుంది. మీరు దీన్ని ఉపయోగించాలా వద్దా అని మీరు నిర్ణయించుకోవచ్చు.

పిల్లలకు ఇలాంటి చాక్లెట్ పౌడర్ ఇచ్చేటపుడు ఎంత మోతాదులో ఇవ్వాలో చూసుకోవాలి. రోజుకు ఒకసారి చాక్లెట్ పౌడర్ ఇవ్వడం క్షేమకరమని నిపుణులు చెబుతున్నారు. బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి ఇలా చాక్లెట్ పౌడర్ (హెల్త్ డ్రింక్) కలపడం మంచిది కాదని అంటున్నారు. ఎందుకంటే పాలలో చక్కెర ఉంటుంది. చాక్లెట్ పౌడర్ జోడించడం ప్రమాదకరం. ఈ కారణంగా, ఈ చాక్లెట్ పొడిని మీ పిల్లలకు చిన్న గిన్నెలో ఇవ్వడం మంచిది.



Source link

Related posts

పిల్లల పుడితే భార్యాభర్తలు విడాకులు తీసుకోకుండా ఉంటారా?

Oknews

20 ఏండ్ల జర్నీ పూర్తి చేసుకున్న ఫేస్‌బుక్‌.. సోషల్ మీడియాలో సంచలనం

Oknews

రాంగ్ పర్సన్‌ సిగ్నల్ అంటే ఏమిటి?.. సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

Oknews

Leave a Comment