Entertainment

బ్రహ్మ రాక్షసుడినే అని ఒప్పుకున్న గోపీచంద్.. పండగ చేసుకుంటున్న  ఫ్యాన్స్ 


గోపి చంద్ నటనకి ఉన్న పవర్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. యజ్ఞం,రణం,శంఖం, లౌక్యం లాంటి సూపర్ హిట్ సినిమాలు  ఆయన ఖాతాలో ఉన్నాయి.వాటిల్లో  గోపీచంద్  యాక్షన్ గాని  డైలాగ్స్ గాని ఒక లెవల్లో ఉండి అయన అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ఇక  గత కొన్ని సంవత్సరాలుగా తమ అభిమాన కథానాయకుడి కట్ అవుట్ కి తగ్గట్టు  సరైన సినిమా పడటంలేదనే బాధ గోపీచంద్ ఫ్యాన్స్ లో ఉంది.ఇప్పుడు వాళ్ళందరి కోరిక భీమాతో నెరవేరబోతుంది.   

కొంచం సేపటి క్రితమే భీమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మహా విష్ణువు యొక్క ఆరవ అవతారం పరశురాముడు. తన ఆయుధమైన గండ్రగొడ్డలితో అనంత సాగరాన్ని వెనక్కి పంపి  తన పేరు మీద ఒక క్షేత్రాన్ని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆ  క్షేత్రంలో పరమేశ్వరుడిని నెలకొల్పుతాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు అహంకారంతో విర్రవీగుతున్న రాక్షసులని   అంతమొందించడానికి జాలి, దయ, కరుణ లేని ఒక బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. ఆ బ్రహ్మ రాక్షసుడు ఎవరో కాదు గోపీచంద్. ఈ విధంగా వాయిస్ ఓవర్  వచ్చిన ట్రైలర్ లో గోపీచంద్ తన నట  విజృంభణని కొనసాగించాడు.

ఒక రౌడీతో నేను ఊచకోత మొదలుపెడితే ఊరు స్మశానం అవుతుందని గోపి చంద్ చెప్పిన  డైలాగ్ అయితే  గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అలాగే మూవీ విజువల్ వండర్ గా కూడా  వుండబోతుందనే విషయం  అర్ధం అవుతుంది. ట్రైలర్ రిలీజైన  కాసేపటికే రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.ట్రైలర్ చూసిన వాళ్లంతా సినిమా పక్కాగా  హిట్ అని అంటున్నారు. గోపి చంద్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. చాలా సంవత్సరాల తర్వాత మా హీరో రికార్డు లు సృష్టించబోయే సినిమా చేస్తున్నాడని సంబరాల్లో మునిగిపోయారు. మహా శివరాత్రి కానుకగా మార్చ్  8 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న భీమా ని  శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై రాధామోహన్ నిర్మిస్తుండగా కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా చేస్తున్నారు



Source link

Related posts

బాలయ్య ఆవేశం ఏ రేంజ్ లో ఉంటుందో….

Oknews

ఈ రోజు నందమూరి తారకరత్న జయంతి

Oknews

ప్రభాస్ వారసుడు గౌడ్ సాబ్ ఎంట్రీ

Oknews

Leave a Comment