Telangana

‘భద్రాచలం’ చూసొద్దామా..! పర్ణశాలతో పాటు ఈ ప్రాంతాలకు వెళ్లొచ్చు, స్పెషల్ టూర్ ప్యాకేజీ ఇదే-telangana tourism operate package tour to bhadrachalam from hyderabad ,తెలంగాణ న్యూస్



భద్రాచలం, పాపికొండల టూర్ షెడ్యూల్:ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే భద్రాచలంతో పాటు పాపికొండలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది తెలంగాణ టూరిజం.ఈ ప్యాకేజీని హైదరాబాద్ నగరం నుంచి అందుబాటులో ఉంటుంది.ప్రతి వీకెండ్ లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. శుక్రవారం సిటీ నుంచి నాన్ ఏసీ బస్సులో బయల్దేరుతారు. ఈ టూర్ మూడు రోజులు ఉంటుంది.మొదటి రోజు హైదరాబాద్ వెళ్లి భధ్రాచలం చేరుకుంటారు.రెండో రోజు గోదావరి తీరం గుండా ఉండే పాపికొండల ప్రకృతి అందాలను వీక్షిస్తారు. బోట్ లో జర్నీ సాగుతుంది. రాత్రి తిరిగి భద్రాచలానికి వస్తారు.ఇక మూడో రోజు ఉదయం భద్రాద్రి రామయ్యను దర్శిచుకుంటారు. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అనంతరం పర్ణశాలను చూస్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.ఈ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 6,999 గా నిర్ణయించారు. పిల్లలకు 5599గా ఉంది .ఈ ట్రిప్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 1800-425-46464 నెంబర్ కు కాల్ చేయవచ్చు.info@tstdc.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.మరోవైపు ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని(Bhadrachalam Kalyanam) నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకను దగ్గరి నుంచి వీక్షించాలని కోరుకునే భక్తులకు దేవాలయ కమిటీ టిక్కెట్ ను నిర్ణయించింది. రూ.10 వేలు, రూ.5 వేలుగా ఈ టిక్కెట్ రుసుమును నిర్ణయించారు. మిథుల మండపానికి అత్యంత సమీపంలోనే ఈ టిక్కెట్ల వీక్షకులు కూర్చునే అవకాశాన్ని కల్పించారు. అలాగే శ్రీరామ నవమి రోజున రాముని కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే భక్తులకు ఆన్లైన్ తో పాటు ప్రత్యేక కౌంటర్లలో కూడా టికెట్లను విక్రయిస్తున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఇప్పటికే ప్రకటించారు. రూ. 7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150 విలువ కలిగిన టికెట్లను ఇప్పటికే భక్తులకు అందుబాటులో ఉంచారు. మిథిలా మండపానికి సమీపంలో ఏర్పాటు చేసిన సీట్లను విలువైన సెక్టార్లను ఉద్దేశించి ఏర్పాటు చేశారు. వీటికి టిక్కెట్లను (రూ.10 వేలు, రూ.5 వేలు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం నుంచి విక్రయిస్తున్నారు. 17న జరిగే కళ్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కమిషనర్ వివరించారు.



Source link

Related posts

Eatala Rajender warns Revanth Reddy over his comments on PM Modi | Eatala Rajender: రేవంత్ నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో

Oknews

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్- వారం రోజుల్లో ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్-kodangal news in telugu cm revanth reddy says 200 free power 500 gas cylinder schemes implemented in a week ,తెలంగాణ న్యూస్

Oknews

RS Praveen Kumar joins in BRS Party before KCR in erravalli farm house

Oknews

Leave a Comment