డైమండ్ లీగ్ 2023 ఫైనల్‍లో చెక్ రిపబ్లిక్ ఆటగాడు జాకబ్ వాద్లెజ్ ఛాంపియన్‍గా నిలిచాడు. ఫైనల్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్‍ను 83.80 మీటర్లు విసిరి రెండో స్థానం సంపాదించుకున్నాడు. మొదటి, నాలుగో ప్రయత్నాల్లో విఫలమైన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. మూడు, ఐదు, ఆరు ప్రయత్నాల్లో వరుసగా 81.37, 80.74, 80.90 మీటర్ల దూరంలో జావెలిన్‍ను త్రో చేశాడు నీరజ్ చోప్రా. ఇక చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జాకబ్ వాద్లెచ్ తన ఆఖరు ప్రయత్నంలో 84.24 మీటర్ల దూరంలో ఈటెను విసిరి అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు.