Andhra Pradesh

భార్యకు శిరోముండనం చేసి ఊరంతా తిప్పుతూ, తూర్పుగోదావరి జిల్లాలో భర్త అమానుషం!-east godavari crime news in telugu husband tonsures wife rounding in streets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


శిరోముండనం చేసి ఊరంతా తిప్పుతూ

మూడు రోజుల క్రితం పెదకొండేపూడిలోని తన భర్త ఇంటికి వెళ్లింది ఆషా. ఇంటికి వచ్చిన ఆషాపై అభిరామ్ ఒక మృగంలా పైశాచికంగా వ్యవహరించాడు. ఇష్టం వచ్చినట్లు ఆమెపై దాడి చేసి ట్రిమ్మర్ తో ఆమెకు గుండు గీశాడు. ఆ తర్వాత ఆ జట్టును ఒక చేతితో పట్టుకుని, ఆమెను మరో చేతితో లాక్కుంటూ ఊరంతా హల్ చల్ చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీతానగరం పోలీసులు, అక్కడికి చేరుకుని బాధితురాలికి చికిత్స కోసం రాజమండ్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు అభిరామ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అతడిని కోర్టులో హాజరు పరచగా రిమాండు విధించింది. ప్రేమించి పెళ్లి చేసుకుని షేక్‌ ఆషా అనే మహిళను మోసం చేయడమే కాకుండా, శిరోముండనం చేసి ఇంటి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి అమానుషంగా ప్రవర్తించి, చంపుతానని బెదరింపులకు దిగడంతో నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండుకు పంపించినట్లు సీతానగరం ఎస్సై రామకృష్ణ తెలిపారు.



Source link

Related posts

CM Revanth Reddy : కడపలో ఉపఎన్నిక వస్తే షర్మిల విజయం కోసం గల్లీ గల్లీ ప్రచారం చేస్తా

Oknews

IAS Imtiaz Ahmed : వైసీపీలో చేరిన ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌

Oknews

ఎలక్షన్ ఎఫెక్ట్‌…! ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు లేదు… పాత టారిఫ్ వసూలుకు నిర్ణయం-election effect no increase in electricity charges this year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment