గోపీచంద్ నయా మూవీ భీమా. మహా శివరాత్రి కానుకగా నిన్న విడుదల అయ్యింది. చాలా కాలం తర్వాత గోపీచంద్ నుండి వచ్చిన ఫుల్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ కావడంతో మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం 0.62 , సీడెడ్ 0.34 ,ఉత్తరాంధ్ర 0.31 , ఈస్ట్ 0.13 , వెస్ట్ 0.11 గుంటూరు 0.26 కృష్ణా 0.29 ,నెల్లూరు 0.09 ఇలా ఏపీ తెలంగాణ కలిపి 2.15 కోట్లు ని సాధించింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 0.1 2 , ఓవర్సీస్ 0.20 ఇలా వరల్డ్ వైడ్ గా 2.47 కోట్ల షేర్ ని సాధించింది. దీన్ని బట్టి భీమా మంచి వసూళ్ల దిశగా పయనిస్తుందని చెప్పాలి. అలాగే వీకెండ్స్ లో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు గోపీచంద్ పెర్ ఫార్మెన్స్ కి ఫిదా అవుతున్నారు. డ్యూయల్ రోల్ లో తన నట విశ్వరూపాన్ని చూపించాడని అంటున్నారు. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన భీమాలో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ లు గోపీచంద్ తో జత కట్టారు. కేకే రాధామోహన్ నిర్మాతగా వ్యవహరించగా హర్ష దర్శకత్వాన్ని వహించాడు. ఈయన కన్నడంలో పలు సినిమాలకి దర్శకత్వం వహించాడు. సీనియర్ నరేష్,నాజర్,రఘుబాబు ,కాశీ విశ్వనాధ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు