Telangana

మంజీరా నదిలో మహిళ మృతదేహం కేసు- మతిస్థిమితం లేదని హత్య చేసిన భర్త, కొడుకులు!-sangareddy crime news in telugu husband sons killed wife mentally ill ,తెలంగాణ న్యూస్



Sangareddy Crime : మంజీరా నదిలో రెండు రోజుల క్రితం లభ్యమైన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త, కొడుకే మహిళ గొంతుకు తాడు బిగించి హత్య చేసి నదిలో మృతదేహాన్ని పడేశారని పోలీసులు తెలిపారు. జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పసల్ వాది గ్రామానికి చెందిన దర్జీ మల్లీశ్వరి (42) ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైoది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయం కావడంతో మతిస్థిమితం కోల్పోయింది. మూర్ఛ వ్యాధి కూడా ఉంది. ఆమెను ఎన్నో హాస్పిటల్స్ కి తీసుకెళ్లి, సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మల్లీశ్వరి కొడుకులు, భర్త, చిన్న పిల్లలను కొరకడం,కొట్టడం చేస్తుండేది. ఇవన్నీ భరించలేక విసిగిపోయిన భర్త సత్యనారాయణ, పెద్ద కుమారుడు ప్రవీణ్ కలిసి ఆమెను చంపేస్తే మిగిలిన కుటుంబసభ్యులైనా ప్రశాంతంగా బతకొచ్చని భావించారు. వారు అనుకున్న పథకం ప్రకారం జనవరి 28న అర్ధరాత్రి ఆమె పడుకున్నాక గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రగ్గులో చుట్టి బండరాయి కట్టారు. ఆ తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి రాయికోడ్ మండలం సిరూర్ శివారులోని మంజీరా నదిలో పడేసి స్వగ్రామానికి వెళ్లారు.



Source link

Related posts

Harish Rao Participates Dasara Celebrations At Siddipet

Oknews

Protective Clothing : హైదరాబాదీ అద్భుత సృష్టి – మంటలను కూడా తట్టుకునే 'డ్రెస్' రూపకల్పన

Oknews

Former CM KCR condemned Kejriwal arrest | KCR : కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు

Oknews

Leave a Comment