Entertainment

మంజుమ్మెల్ బాయ్స్ మూవీ రివ్యూ 


సినిమా పేరు: మంజుమ్మెల్ బాయ్స్

తారాగణం: సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ ,అర్జున్ కురియన్ తదితరులు

రచన, దర్శకత్వం : చిదంబరం 

సంగీతం : సుశీన్ శ్యామ్

నిర్మాతలు :  బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని

బ్యానర్: పరవ ఫిలిమ్స్ 

విడుదల తేదీ: ఏప్రిల్ 06  2024 

ఫిబ్రవరి 22 న మలయాళంలో విడుదలై  సంచలన విజయం సాధించిన మూవీ  మంజుమ్మెల్ బాయ్స్. ఈ రోజు తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఎలా ఉందో చూద్దాం

కథ

కేరళలోని కొచ్చి కి చెందిన తొమ్మిది నుంచి 10 మంది మిత్ర బృందం చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు. వీళ్లంతా లోయర్ మిడిల్ క్లాస్ కి చెందిన వాళ్ళు.రకరకాల పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.మంజుమ్మెల్ బాయ్స్ అనే పేరుని  తమ టీమ్ కి పెట్టుకుంటారు. అదే ఊరులో ఉండే ఇంకో గ్యాంగ్ కి వీళ్ళకి అసలు పడదు.ప్రతి విషయంలో పోటీ ఉంటుంది. ఆ క్రమంలో ఆపోజిట్ గ్యాంగ్ ఒక టూర్ వెళ్లి ఫోటోలు దిగుతుంది. మంజుమెల్ బాయ్స్ కూడా టూర్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అందులో భాగంగా కోడై కెనాల్ వెళ్తారు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఒక ఫ్రెండ్  గుణ గుహ లో పడిపోతాడు.ఆ తర్వాత మిగతా వాళ్ళు ఏం చేసారు?  ఇంతకీ గుణ గుహ కి ఉన్న కథ ఏంటి?  చివరకి  ఏం జరిగింది అనేదే మిగతా  కథ

ఎనాలసిస్ 

ఈ మంజుమ్మెల్ బాయ్స్ నిజజీవితంలో జరిగిన కథే. ఈ విషయం కేరళ రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. సినిమా రిలీజ్ అయ్యాక మిగతా వారికి కూడా తెలిసింది. దీంతో థియేటర్ కి వెళ్లే ప్రేక్షకుడు ప్రిపేర్ అయ్యే వెళ్తాడు. అంటే ఎలాంటి అంచనాలని తన మైండ్ లో పెట్టుకోడు. సో ఇక దర్శకుడు ముందున్న కర్త్యవం ఒక్కటే. థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకుడిని పకడ్బందీ కథనంతో కూర్చోబెట్టడం. ఈ విషయంలో దర్శకుడు నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు.సినిమా   చూస్తున్నంత సేపు కూడా  థియేటర్ లో కూర్చొని ఒక సినిమా చూస్తున్నామనే  ఫీలింగ్ ఉండదు.మంజుమ్మెల్ బాయ్స్  పక్కనే ఉండి  అక్కడ జరిగేదంతా చూస్తున్నామనిపిస్తుంది. జనరల్ గా  ఏ సినిమా గురించి అయినా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఇలా ఉంది, సెకండ్ ఆఫ్ ఇలా ఉందని  చెప్పుకుంటాము. కానీ ఈ మూవీకి మాత్రం అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా మొత్తం ఎలా  ఉండబోతుందో మనకి ముందుగానే తెలుస్తుంది.ఇక మనకి కావాల్సింది కేవలం భావోద్వేగం మాత్రమే. అది పర్ఫెక్ట్ గా  వర్క్ అవుట్ అయ్యింది. మూవీ ఆసాంతం మంజుమ్మెల్ బాయ్స్ తో ట్రావెల్ అవుతూ  ఉంటాం. 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు

ఒక్కరని కాదు మంజుమ్మెల్ బాయ్స్ టీమ్ మొత్తం సూపర్ గా నటించింది.ప్రేక్షకులకి మేము ముందుగానే తెలుసు అనేంత సహజంగా నటించారు.వాళ్ళ బాధని ప్రేక్షకుడి బాధగా మార్చడం లో సక్సెస్ అయ్యారు.  ఇక ముఖ్యంగా దర్శకుడు చిదంబరం గురించి చెప్పుకోవాలి.  సినిమా మొత్తం ఒకే పాయింట్ తో నడిచే కథ ని పకడ్బందీ స్క్రీన్ ప్లే తో మెప్పించాడు. గుహలో సీన్స్ ని తీసిన విధానంకి గాని  పోలీస్ స్టేషన్ సీన్స్ కి గాని హాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్ననాటి ఎపిసోడ్ లని గుహ ప్రాంతానికి కనెక్ట్ చేసిన విధానం చాలా  బాగుంది.సహజమైన కథ కి సహజమైన స్క్రీన్ ప్లే ని అద్దాడు. అలాగే ఎంతో మంది నవతరం దర్శకులకి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఫ్యూచర్ లో అన్ని భాషల్లో ఇలాంటి నిజజీవిత సినిమాలు రావచ్చు. ఇక కెమెరా పని తనం కూడా  సూపర్.ఆ డిపార్ట్మెంట్ పడిన కష్టమంతా ప్రతి ఫ్రేమ్ లో కనపడుతుంది.  డైలాగ్స్ లో  పెద్దగా మెరుపులు లేవు. ఈ కథ కి  ఆ అవసరం కూడా లేదు. మ్యూజిక్ ది కూడా అదే పరిస్థితి. కాకపోతే ఆర్ఆర్ కొంచం బెటర్ 

ఇక ఫైనల్ గా చెప్పాలంటే స్నేహం అంటే ఎంగిలి సిగెరెట్స్, ఎంగిలి కామెడీ కాదని  స్నేహం సర్వేశ్వరుడి కంటే గొప్పదని అది ప్రాణాలని నిలపగలదని మంజుమ్మెల్ బాయ్స్  చెప్పింది. ఈ మాట నిజం అని  2006 లోనే  నిరూపితమైంది

రేటింగ్ 3 /5                                                                                                                                                                                                                                                                           అరుణా చలం

 



Source link

Related posts

హాట్ స్పాట్ మూవీ రివ్యూ

Oknews

రోజా దేవుడితో మాట్లాడుతుంది.. నా తల్లి అంటున్న కేసీఆర్ 

Oknews

లారెన్స్‌ ప్రాజెక్ట్‌ నుంచి నయనతార ఔట్‌! 

Oknews

Leave a Comment