Andhra Pradesh

మంత్రి ఫోన్ చేస్తే…ఎవ‌ర‌ని ప్ర‌శ్నించార‌ని బ‌దిలీ వేటు!


ఏపీ ర‌వాణాశాఖ మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డికి కోపం వ‌చ్చింది. మంత్రిగా ఫోన్ చేస్తే, ఎవ‌ర‌ని ప్ర‌శ్నించిన త‌న శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారిపై ఆయ‌న బ‌దిలీ వేటు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బ‌దిలీ వేటుకు ఆర్టీసీ క‌డ‌ప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ (ఈడీ) గిడుగు వెంక‌టేశ్వ‌ర‌రావు గురి కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే ఈడీ బ‌దిలీకి మ‌రో కార‌ణాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఆదేశించినా, ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే వేటు వేశార‌ని చెబుతున్నారు. కానీ అస‌లు విష‌యం వేరే. మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి ఈడీకి ప‌లుమార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. అలాగే ఒక‌సారి రిసీవ్ చేసుకుని, ఎవ‌ర‌ని ఈడీ వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌శ్నించార‌ని స‌మాచారం.

మంత్రి అయిన త‌న సెల్ నంబ‌ర్‌ను ద‌గ్గ‌ర పెట్టుకోక‌పోవ‌డంతో పాటు ఎవ‌ర‌ని ప్ర‌శ్నించ‌డాన్ని మంత్రి జీర్ణించుకోలేకున్నారు. దీంతో క‌డ‌ప జోన్ ఈడీపై వైసీపీ ముద్ర వేసి, ఆయ‌న్ను అక్క‌డి నుంచి బ‌దిలీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మంత్రి ఫోన్ చేస్తే ఎవ‌ర‌ని ప్ర‌శ్నించ‌డం ఏంట‌ని టీడీపీ నేత‌లు నిల‌దీస్తున్నారు. ఇలాంటి అధికారిని సొంత జిల్లాలో పెట్టుకుని ఎలా ప‌ని చేయించుకోవాల‌ని టీడీపీ ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఈడీపై బ‌దిలీ వేటు మిగిలిన ఉద్యోగుల‌కు ఒక హెచ్చ‌రిక‌గా అధికార పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.



Source link

Related posts

ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు ఎస్బీఐ ఊరట, క్లర్క్ పరీక్ష మార్చి 4వ తేదీకి మార్పు-vijayawada news in telugu appsc group 2 exam sbi changed clerk exam date to march 4th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రాజకీయ నాయకుల కంటే దారుణంగా ఏపీ బ్యూరోక్రాట్లు.. సిఎంను ప్రసన్నం చేసుకోడానికి తంటాలు-ap bureaucrats are worse than politicians ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఎటూ తేల్చకుండానే ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్… ఉద్యోగ సంఘాల అసంతృప్తి-ap joint staff council ended inconclusively discontent of the trade unions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment