Health Care

మధ్యాహ్నం బద్దకంగా ఉంటుందా.. ఇలా చేస్తే మైండ్ రీ ఫ్రెష్ అవుతుంది..


దిశ, ఫీచర్స్ : ఆఫీసులో పని చేస్తున్నప్పుడు, మధ్యాహ్నం నిద్ర రావడం, నీరసంగా అనిపించడం మొదలవుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు చాలా మంది వ్యక్తుల సమస్య. వారు తమ రోజును ఫ్రెష్ గా ప్రారంభించినప్పటికీ మధ్యాహ్న సమయంలో కాసేపు కునుకు తీయాలనుకుంటారు. ఇలా కాకుండా తాజా అనుభూతి కోసం టీ లేదా కాఫీ పై ఆధారపడతారు. కానీ కొన్ని స్నాక్స్ తో ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చంటున్నారు నిపుణులు.

మధ్యాహ్నం ఆహారం తిన్న తర్వాత ఒళ్లు మజ్జుగా ఉండి నిద్ర వస్తుంది. దీనికి కారణం బహుశా మీరు తినే భోజనంలో ఉప్పు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం కావచ్చు. అలాగే మొబైల్ లేదా కంప్యూటర్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం, చాలా తక్కువ నీరు త్రాగడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా మీరు పగటిపూట కాస్త మత్తుగా ఉండవచ్చు. అందుకే రోజంతా ఉత్సాహంగా ఉంచే స్నాక్స్ ను తినమంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొలకలు..

పగటిపూట బద్ధకాన్ని నివారించడానికి, మీరు ఆరోగ్యకరమైన, తేలికపాటి భోజనం తీసుకోవడం చాలా ముఖ్యం. మొలకలు ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్‌లకు మంచి మూలం. అందుకే మధ్యాహ్నం స్నాక్స్ కోసం విత్తనాల మొలకలను తీసుకోవచ్చు.

నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, గింజలు..

మధ్యాహ్న స్నాక్స్ కోసం, మీరు నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, గింజలను తీసుకోవచ్చు. దీనితో మీరు తక్షణ శక్తిని అందించే మంచి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పొందుతారు. దీంతో మీరు ఫిట్‌గా ఉంటారు.

ఉడికించిన గుడ్డు..

గుడ్లు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ఇది శరీరంలో రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. దీని కారణంగా మీరు సోమరితనం పోతుంది. అందుకే ఉడికించిన గుడ్డు తినడం మంచిదంటున్నారు.

ఈ హెల్తీ డ్రింక్..

మధ్యాహ్నం నిద్ర, సోమరితనం నుంచి బయటపడటానికి కొబ్బరి నీరు తాగడం మంచిదంటున్నారు. ఇది ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది.

ఈ విషయాలకు బై – బై చెప్పండి

మీరు మధ్యాహ్నం పూట మిమ్మల్ని మీరు ఎనర్జిటిక్‌గా ఉంచుకోవాలనుకుంటే, ప్యాక్డ్ ఎనర్జీ డ్రింక్స్, టీ, కాఫీలకు బై-బై చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. అధిక వినియోగం శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఈ పానీయాలన్నీ చక్కెరను కలిగి ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్‌ని పెంచుతాయి. ఇది మీకు తాజాగా కాకుండా మరింత నిద్రపోయేలా చేస్తుంది.



Source link

Related posts

Ugadi Panchangam : ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నా అంతా శుభమే!

Oknews

మీ గ్యాస్ త్వరగా అయిపోతుందా.. ఈ టిప్స్ పాటించండి!

Oknews

పురాతన అంబర్‌నాథ్ శివాలయంలో కొబ్బరికాయలు కొట్టడం నిషేధం.. అసలు కారణం ఏమిటి ?

Oknews

Leave a Comment