Health Care

మనం ధరించే దుస్తుల వల్ల ప్రమాదం జరగొచ్చా!


దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో కూడా ఊహించలేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ ఉన్నతాధికారులు నిత్యం అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. ఈ అవగాహనా కార్యక్రమంలో భాగంగానే పెట్టిన ఓ ట్వీట్ ఆశ్చర్యకరంగా ఉంది. మీరు ధరించే దుస్తులు కూడా రోడ్డు ప్రమాదాలకు ఒక్కోసారి కారణం అవుతాయని తెలుసా? అంటూ.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఆ వీడియోలో నల్ల చొక్కా ధరించిన వ్యక్తి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరుగుతుంది. దీనిపై అవగాహన కల్పిస్తూ.. రాత్రి సమయాల్లో బైక్ పై లేదా నడుచుకుంటు వెళ్లేవారు చీకటిలో కూడా కనిపించేలా.. పసుపు, తెలుపు, నీలి ఆకుపచ్చ లాంటి లైట్ కలర్ దుస్తులు ధరించాలని చెబుతున్నారు. నలుపు, బులుగు, ఎరుపు లాంటి డార్క్ కలర్ దుస్తులు ధరించడం వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ట్విట్టర్ వీడియో ద్వారా తెలియజేశారు.





Source link

Related posts

సిటీలో మరో కొత్త వైరస్ కలకలం.. తాగే నీరే కారణమంటున్న వైద్యులు.. లక్షణాలు, నివారణ చర్యలు!

Oknews

Viral : ప్రపంచమంతా 2024లో ఉంటే.. అక్కడి ప్రజలు మాత్రం 2016లోనే!

Oknews

మీ పిల్లలతో ఇలా డీప్ కనెక్షన్ ఏర్పరుచుకోండి…

Oknews

Leave a Comment