దిశ, ఫీచర్స్: ఆయుర్వేద శాస్త్రంలో, అనేక మూలికలు క్లుప్తంగా వివరించబడ్డాయి. కొన్ని ఔషధ మొక్కలు కూడా ప్రస్తావించబడ్డాయి. మన పూర్వీకులు వివిధ వ్యాధులకు ఔషధ మొక్కలను ఉపయోగించారు. తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల్ని మూలికలచే తగ్గించునేవారట.. ఆయుర్వేదంలో ప్రతి వ్యాధికి ఒక మూలిక ఉంది. అయితే మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి సులభంగా ఉపశమనం కలిగించే మొక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో బిళ్ళ గన్నేరు మొక్క ఒకటి. ఇది మధుమేహం అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి సులభంగా ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు బిళ్ళ గన్నేరు మొక్కను ఎలా ఉపయోగించాలి? దీని వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అధిక రక్తపోటు
బిళ్ళ గన్నేరు ఆకుల్లో రక్తపోటు తగ్గించే శక్తి ఉంటుంది. అంతే కాకుండా, పెద్ద మొత్తంలో రక్తపోటు తగ్గించే ప్రభావం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటు సమస్యలు కూడా నిరోధించబడతాయి.
మధుమేహం నియంత్రణ
బిళ్ళ గన్నేరు ఆకుల రసాన్ని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇందులోని యాంటీ-డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.