బొమ్మాళీ అనుష్క గత సంవత్సరం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్ డేట్ ఉమెన్ గా చెఫ్ గా ఆమె ప్రదర్శించిన నటన ప్రతి ఒక్కర్నిఎంతగానో ఆకట్టుకుంది. మూవీ కూడా మంచి విజయాన్నే నమోదు చేసింది. దీంతో తను చెయ్యబోయే నెక్స్ట్ మూవీ మీద అందరిలోను ఆసక్తి ఉండటం సహజం.ఈ నేపథ్యంలో తాజా వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
అనుష్క ప్రముఖ దర్శకుడు క్రిష్ తో ఒక మూవీ చెయ్యబోతుందనే వార్తలు ఇటీవల వచ్చాయి.ఆల్రెడీ ఆ ఇద్దరి కాంబోలో వేదం వచ్చి ఘన విజయం సాధించింది.అందులో అనుష్క వేశ్య పాత్రని పోషించింది. దీంతో ఆ ఇద్దరి కమ్ బ్యాక్ మూవీ ఎలాంటి సబ్జెక్టు తో తెరకెక్కనుందనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఇప్పుడు అనుష్క హఠాత్తుగా ఒక మలయాళ మూవీ కి కమిట్ అయ్యింది. కథనార్ అనే టైటిల్ తో ఆ మూవీ తెరకెక్కనుంది.అనుష్క మలయాళంలో నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే.ఆల్రెడీ మూవీ సెట్స్ లోకి కూడా అడుగుపెట్టింది..ఈ సందర్భంగా టీమ్ తో కలిసి ఆమె దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే అనుష్క నెక్స్ట్ సినిమా మలయాళంలో రిలీజ్ కాబోతుందన్నమాట.
మలయాళ చిత్ర సీమలో వినిపిస్తున్న కథనాల ప్రకారం కథనార్ లో అనుష్క నెగటివ్ రోల్ ని పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. జయసూర్య.వినీత్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా మిగతా నటి నటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సుబ్రమణియన్ మ్యూజిక్ ని అందిస్తుండగా గోకులం గోపాలన్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. రోజిన్ థామస్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.